newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ సోషల్ మీడియా అకౌంట్లే మీకు శత్రువు...ఎలాగంటే?

29-06-201929-06-2019 16:15:59 IST
2019-06-29T10:45:59.828Z29-06-2019 2019-06-29T10:45:53.986Z - - 17-04-2021

 మీ సోషల్ మీడియా అకౌంట్లే మీకు శత్రువు...ఎలాగంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉన్నతవిద్య కోసం, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళాలని అంతా కోరుకుంటారు. కానీ కొంతమంది వీసాలు వివిధ కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంటాయి. అయితే తమ వీసా అప్లికేషన్ ఎందుకు తిరస్కరించారో చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ..వారు తెలిసి చేసినవి ఏమీ ఉండవు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న చాలామంది చేసే తప్పులు వాళ్ళు చేసి ఉంటారు. ఎందుకంటే యూఎస్ ఎంబసీ సాధారణంగా వీసాను ఆషామాషీగా తిరస్కరించదు. అయితే యూత్ సాధారణంగా సోషల్ మీడియాలో చేసే పోస్టులే వారికి శత్రువులుగా మారతాయంటే మీరు నమ్ముతారా? వీసాలు తిరస్కరించడానికి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, కామెంట్లు చేయడం కారణం కావచ్చు.

యుఎస్ వెళ్లాలనుకునే వారి సోషల్ మీడియా అకౌంట్లపై పూర్తిగా నిఘా ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వారు సోషల్ మీడియాలో వారి అకౌంట్లో పోస్ట్ చేసిన డేటాను యూఎస్ పరిశీలిస్తోంది. అందులో ఏదైనా వివాదం ఉంటే వెంటనే వారి అప్లికేషన్ ని తిరస్కరిస్తోంది. వీసా ఫిల్ చేసేవారు E-forms D-160 and D-260లను ఫిల్ చేసే సమయంలో సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా అందులో పొందుపరచాలి. అందులో మీరిచ్చే సోషల్ మీడియా అకౌంట్లను అమెరికా అధికారులు అమూలాగ్రం పరిశీలిస్తారు.

Facebook, Flickr, Google+, Twitter, Instagram, LinkedIn and YouTube .. అన్నీ మీరు తెలియచేయాలి. వీటి ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అందుకే యుఎస్ వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో ఎంతో అప్రమత్తత అవసరం.  సాధారణంగా రాజకీయ సంబంధిత అంశాలను యూత్ బాగా ఫాలో అవుతుంటారు.

ఇలాంటివి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. మీడియాలో రాజకీయ సంబంధిత పోస్టుల గురించి ఎటువంటి పనులు చేయకూడదు. పోస్టులు పెట్టడం కాని లేదా షేర్ చేయడం కాని , అలాగే రీ ట్వీట్ చేయడం చేయకూడదు. అలాగే మీరు షేర్ చేసే, పోస్ట్ చేసే అంశాల్లో హింస, అశ్లీలం, తీవ్ర విమర్శలు ఉండకూడదు. ఆల్కహాల్, డ్రగ్స్, ధూమపానం వంటి ఫోటోలు వెంటనే తొలగించండి. మీరు సోషల్ మీడియాలో పోస్టు చేసే అంశాలపై నిఘా ఉంటుందని గమనించండి. సాధ్యమయినంత వరకూ సోషల్ మీడియా అకౌంట్లలో అనవసరపు డేటా ఉండకూడదని గ్రహించండి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle