newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

మీ షర్టే ఒక ఏసీ.. హాయిగా సేదతీరొచ్చు

29-07-201929-07-2019 16:06:14 IST
Updated On 29-07-2019 16:05:50 ISTUpdated On 29-07-20192019-07-29T10:36:14.802Z29-07-2019 2019-07-29T10:35:22.440Z - 2019-07-29T10:35:50.511Z - 29-07-2019

మీ షర్టే ఒక ఏసీ.. హాయిగా సేదతీరొచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాస్త ఉక్కబోతకు జనం అల్లాడిపోతుంటారు. ఎక్కడ ఉన్నా వెంటనే ఏసీ కిందకు వచ్చేస్తారు. లేదంటే ఫ్యాన్ గాలికి సేదతీరుతారు. అదే మన దగ్గరే చిన్న ఏసీ ఉంటే ఎలా వుంటుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ ఓ కొత్త పోర్టబుల్‌ ఎయిర్ కండిషనర్‌ని తీసుకొచ్చింది. దీనికి ఆ కంపెనీ 'రియాన్‌ పాకెట్‌’అని పేరు పెట్టింది.

ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే స్మార్ట్ ఫోన్ సైజుకంటే చాలా చిన్నదిగా ఉంటుంది. హాయిగా దీనిని చొక్కా జేబులో కూడా పెట్టేసుకోవచ్చు. బ్యాటరీ సాయంతో ఇది పనిచేస్తుంది. ధర తక్కువే. దీని కోసం ప్రత్యేకంగా లోపల ధరించే టీషర్ట్‌ను కూడా ఆ కంపెనీ తీసుకొచ్చింది.

Image result for pocket ac

ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఆఫీసులో ఏసీ లేనిచోట కూర్చున్నప్పుడు ఈ బుల్లి ఏసీ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఏసీ వేసవిలో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ ఏసీ ధర రూ.8,992 మాత్రమే. లోపల ధరించే టీషర్ట్‌తో కలిపి ఈ ధరకు కంపెనీ విక్రయిస్తోంది. లోపలి టీషర్ట్‌ వివిధ అందుబాటు సైజుల్లో లభిస్తాయి.

ఒకవేళ డివైజ్‌తో పాటు ఐదు టీషర్ట్స్ ధర సుమారు 12వేలు. లిథియం ఇయాన్ బ్యాటరీతో ఈ ఏసీ పనిచేస్తుంది. కేవలం 2 గంటలు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా ఉపయోగించుకోవచ్చు. వాటర్‌ ప్రూఫ్‌తో ఇది వస్తోంది. అయితే ఇది కేవలం పురుషులకు మాత్రమే అని సోనీ కంపెనీ చెబుతోంది. ఈ ఏసీ కేవలం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle