newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ మొబైల్ పోగొట్టుకున్నారా? దక్కించుకోవడం ఇక ఈజీ..!

17-09-201917-09-2019 12:46:35 IST
2019-09-17T07:16:35.040Z17-09-2019 2019-09-17T07:15:38.811Z - - 14-04-2021

మీ మొబైల్ పోగొట్టుకున్నారా? దక్కించుకోవడం ఇక ఈజీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనందరి దైనందిన జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా ఉంటున్న మొబైల్ ఫోన్ మిస్సయితే ప్రత్యక్ష నరకం మన కళ్లముందే కదలాడుతుంది. మొబైల్స్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. మీరు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఐఎమ్ఇఐ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా తాత్కాలికంగా మీ మొబైల్‌ పనిచేయనీయకుండా చేయవచ్చు. కానీ మొబైల్ పోగొట్టుకున్న తర్వాత పోలీసు రిపోర్టు ఇవ్వకపోతే ఇక మీ మొబైల్ పై ఆశలు వదులుకోవాలసిందే. పోలీసు విచారణలో దొరికితే దొరకవచ్చు లేకుంటే మీరు పోగొట్టుకున్న మొబైల్‌ని డీకోడ్ చేసి సెటప్‌నే మార్చివేసే గజ టెక్నీషియన్ల బారిన పడితే ఎవరైనా చేసేదేమీలేదు.

ఈ నేపధ్యంలో మొబైల్ నెట్‌వర్క్‌లు అన్నింటిలోనూ మనం పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ పోన్‌లను పూర్తిగా బ్లాక్ చేయడం లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును బీఎస్ఎన్‌ఎల్ కొలాబరేషన్‌తో ప్రారంభించనుంది. దీనివల్ల అలా పోగొట్టుకున్న లేక దొంగల బారిన పడిన మొబైల్ ఫోన్లను ఎక్కడున్నా కనిపెట్టడం, నెట్‌వర్క్‌లోని నకిలీ ఐఎమ్ఇఐల తో డూప్లికేట్ మొబైల్ డివైస్‌లను ఉపయోగించడాన్ని నిరోధించడం సాధ్యపడుతుంది. మొబైల్ డివైస్‌లను తారుమారు చేసి దర్జాగా వాడుకునే పరిస్థితిని ఈ ప్రాజెక్టు అరికట్టనుంది.

అసలు విషయానికి వస్తే దొంగిలించబడిన మొబైల్స్ గురించి సాధికారికంగా రిపోర్టు చేయడానికి వీలుకల్పించే ఒక వెబ్ పోర్టల్‌ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలెక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వ వెబ్ సైట్ www.ceir.gov.in ని ప్రభుత్వ నిర్వహణలోని బీఎస్ఎన్‌ఎల్ తో కలిసి మహారాష్ట్రలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మొబైల్ భద్రత, మొబైల్ హ్యాండ్ సెట్ల రీప్రోగ్రామింగ్ వంటి ఇతర సమస్యలను పరిష్కరించడానికి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) సిస్టమ్‌ని టెలికమ్యూనికేషన్ల విభాగం చేపడుతోంది. 

ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఈఐ) అనేది ఏ మొబైల్ ఫోన్ కైనా ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది. ఒకటి లేక రెండు సిమ్‌లను కలిగిన ఫోన్ ఒకటి/రెండు ఐఎమ్ఈఐ నంబర్‌ని కలిగి ఉంటుంది. ఐఎమ్ఈఐ ప్రోగ్రామ్‌తో కూడినది కాబట్టి ఎవరైనా ఈ సంఖ్యను రీప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఐఎమ్ఈఐని క్లోనింగ్ చేయడం కారణంగా ఒకే ఐఎమ్ఈఐ నంబర్ నుంచి అనేక ఫోన్ డివైస్‌లను రూపొందించవచ్చు. ఇంతవరకు ఇలా క్లోన్ చేసిన లేదా డూప్లికేట్ చేసిన ఐఎమ్ఈఐ హ్యాండ్‌సెట్లు నెట్‌వర్క్‌లలో ఉపయోగంలో ఉంటున్నాయి. 

మీరు మొబైల్‌ని పోగొట్టుకుంటే ఏం చేయాలి.? 

మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నా లేక ఎవరైనా మీ మొబైల్‌ని దొంగిలించినా, మొట్టమొదటగా మీరు చేయాల్సిన పని పోలీసు స్టేషన్‌కి వెళ్లి కానీ ఆన్ లైన్‌లో కానీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. తర్వాత టెలికమ్యూనికేషన్ విభాగానికి (డీఓటి) తెలపాలి. దీనికి మీరు 14422 హెల్ప్ లైన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.

మీరు పోగొట్టుకున్న, దొంగిలించిబడిన మీ ఫోన్ వివరాలను పొందిన వెంటనే డీఓటి మీ ఫోన్‌ని బ్లాక్ చేస్తుంది. మీరు పోగొట్టుకున్న మొబైల్‌ని ఉపయోగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, మీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఆ వ్యక్తిని గుర్తుపడతారు. బీఎస్ఎన్ఎల్, రిలయెన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు దొంగను పట్టుకోవడానికి డీఓటీ సహాయం తీసుకుంటాయి.

మొబైల్ పొగొట్టుకున్న తర్వాత ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్‌కీ డీఓటీకి రిపోర్టు చేయడం మనలో చాలామందికి అలవాటు లేదు. ఈ విషయంలో మన బద్ధకమే ఫోన్ దొంగలకు వరం అవుతోంది. మన ఫోన్ పోగొట్టుకుంటే దాన్ని తిరిగి రాబట్టుకోవడం మన చేతుల్లోనే ఉందని అర్థమైంది కదూ. అంతకంటే ముందు మీరు మొబైల్ కొన్న వెంటనే ఐఎంఈఐ నెంబర్ మీ డైరీలో రాసుకోవడం మరచిపోవద్దు. ఫోన్ తో పాటు ఇచ్చే రశీదులో ఈ నెంబర్ వుంటుంది. కాబట్టి మీరు ఫోన్ కొన్న వెంటనే రశీదు భద్రపరుచుకోండి. మీ డైరీలో ఆ నెంబర్ రాసుకోవడం మీకే మంచిది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle