newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ ఐఫోన్‌ ఐఓఎస్‌ 13కి అప్‌డేట్‌ చేశారా... అయితే ఎవరికీ ఇవ్వొద్దు

21-09-201921-09-2019 11:43:32 IST
2019-09-21T06:13:32.804Z21-09-2019 2019-09-21T06:13:26.157Z - - 17-04-2021

మీ ఐఫోన్‌ ఐఓఎస్‌ 13కి అప్‌డేట్‌ చేశారా... అయితే ఎవరికీ ఇవ్వొద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాపిల్‌ తన మొబైళ్లకు తాజా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ iOS 13ను విడుదల చేసింది. ఇప్పటికే మీ మొబైల్‌లో కొత్త ఓఎస్‌ను ఇన్‌స్టాల్‌ చేసేశారా... చక్కగా పని చేస్తోందా. బాగానే ఉంటుంది లెండి. అయితే ఒక్క విషయం. మీ మొబైల్‌ను ఇప్పుడు వేరే వాళ్లకు  ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. కొత్త ఓఎస్‌ సెక్యూరిటీలో కొన్ని లోపాలు ఉన్నాయని ఐఓఎస్‌ పరిశీలకులు చెబుతున్నారు. కొత్త ఓఎస్‌లో ఫేస్‌ ఐడీని హ్యాక్‌ చేసే లూప్‌హోల్‌ ఉందట. దీని ద్వారా మీ ఫోన్‌ కాంటాక్స్ట్‌ను మీకు తెలియకుండానే సులభంగా యాక్సెస్‌ చేయొచ్చుని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కాల్‌ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చట. అయితే మీ మొబైల్‌ హ్యాకర్‌ చేతికి వెళ్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి అపరిచితులకు మీ మొబైల్‌ అస్సలు ఇవ్వొద్దు. 

ఈ భద్రతా లోపం గురించి యాపిల్‌ను ఈ  ఏడాదిలో జూలైలోనే సమాచారం ఉందట. కానీ దీనికి సంబంధించి యాపిల్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ‘పాస్‌కోడ్‌ బైపాస్‌’ సమస్య ఉందని సైబర్‌ సెక్యూరిటీకి చెందిన ఓ ఔత్సాహికుడు జోస్‌ రోడ్రిగ్జ్‌ యాపిల్‌ను జూలైలో సంప్రదించాడు. ఫేస్‌ ఐడీతో ఈ పని చేయొచ్చని రోడ్రిగ్జ్‌ వివరించారు కూడా. ఈ విషయంలో యాపిల్‌ పరిశోధకులు రోడ్రిగ్జ్‌ను సంప్రదించారు. బీటా వెర్షన్‌లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూని వారికి రోడ్రిగ్జ్‌ వివరించాడు.  అయితే రోడ్రిగ్జ్‌ చెప్పిన మాటల్ని యాపిల్‌ వాళ్లు చెవికెక్కించుకోలేదని తెలుస్తోంది.

యాపిల్‌ తన మాటను వినకపోవడంతో ‘పాస్‌కోడ్‌ బైపాస్‌’ ఇష్యూని రోడ్రిగ్జ్‌  ప్రజల ముందుకు తీసుకెళ్లాడు. యాపిల్‌తో జరిగిన చర్చను  సీఎన్‌ఎన్‌ ద్వారా అందరికీ షేర్‌ చేశాడు. దీంతో యాపిల్‌ ఒక మెట్టుదిగి ఇష్యూ కొత్త అప్‌డేట్‌లో ఫిక్స్‌ చేస్తాం అని చెప్పింది. ప్రస్తుతం విడుదలైన iOS 13కు అప్‌డేట్‌గా వచ్చే iOS 13.1లో ‘పాస్‌కోడ్‌ బైపాస్‌’ ఇష్యూని ఫిక్స్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త అప్‌డేట్‌ ఈ నెల 24న యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. అప్పటికిగాని ఈ సమస్య ఫిక్స్‌ అయ్యింది లేనిదీ తెలియదు. అప్పటివరకు iOS 13 ఓఎస్‌ ఉన్న మొబైల్‌ను అపరిచితుల చేతికి ఇవ్వొద్దు అనేది నిపుణుల సూచన. అదీనూ ఫేస్‌ ఐడీ ఉన్న మొబైల్స్‌లోనే. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle