newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ అభిమాన ‘ఓకే గూగుల్‌’ ఇప్పుడు తెలుగులో...

19-09-201919-09-2019 18:55:37 IST
2019-09-19T13:25:37.177Z19-09-2019 2019-09-19T13:25:33.997Z - - 17-04-2021

మీ అభిమాన ‘ఓకే గూగుల్‌’ ఇప్పుడు తెలుగులో...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘ఓకే గూగుల్‌’ అనగానే... మీ మొబైల్‌లో ‘ఎస్‌ ప్లీజ్‌’ అంటూ గూగుల్‌ అసిస్టెంట్‌ రెడీ అయిపోతాడు. అయితే ఇదంతా ఇంగ్లిష్‌లో మాత్రమే సాధ్యం. ఇది పాత మాట. ఇప్పుడు ఈ సంభాషణని తెలుగులో కూడా జరపొచ్చనేది కొత్త ముచ్చట. అవును గూగుల్‌ అసిస్టెంట్‌ తెలుగులో కూడా వస్తోంది. ఆ మాటకొస్తే హిందీ, కన్నడ, బెంగాళీ, తమిళం... ఇలా తొమ్మిది ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గూగుల్‌ కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అందులో  గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇతర భాషల ప్రవేశం ఒకటి. 

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తుంది. అందులో అందరూ గూగుల్‌ను వాడుతుంటారు కానీ..  గూగుల్‌ అసిస్టెంట్‌ని తక్కువగా వాడుతుంటారు. అందుకే గూగుల్‌ అసిస్టెంట్‌ను అందరికీ దగ్గరగా చేయడానికి గూగుల్‌ చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇందులో భాగంగా అసిస్టెంట్‌ను ప్రాంతీయ భాషల యూజర్లకు చేరువ చేస్తున్నారు. అసిస్టెంట్‌ గతంలోనే హిందీలో పని చేసేది. దానికి కోసం డివైజ్‌ లాంగ్వేజ్‌ మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా నేరుగా అసిస్టెంట్‌తో హిందీలో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇతర ఎనిమిది భాషల్లో కూడా. వాటిలో తెలుగు కూడా ఉంది. 

ఇన్నాళ్లూ ఇంగ్లిష్‌లో ఇచ్చే ఆదేశాల ప్రకారం పని చేస్తూ వచ్చిన స్మార్ట్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఫోన్స్‌, కంప్యూటర్లు ఇకపై ఆయా భాషల్లో ఇచ్చే ఆదేశాల అనుసారం పనిచేస్తాయి. ఈ ఫీచర్‌ను తెలుగు, హిందీ, గుజారాతీ, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, తమిళ భాషలకు కల్పించారు. రీజనల్‌ లాంగ్వేజ్‌ సదుపాయం వినియోగించుకోవాలంటే గూగుల్‌ యాప్‌ను ముందుగా అప్‌డేట్‌ చేసుకోవాలి. 

భారత వినియోగదారులు గూగుల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం ఇకపై చాలా సులభం. దీని  కోసం గతంలోలా సిస్టమ్‌ లాంగ్వేజ్‌ మార్చక్కర్లేదు. గూగుల్‌ అసిస్టెంట్‌ను ఓపెన్‌ చేసి ‘హే గూగుల్‌ టాక్‌ టు మి ఇన్‌ హిందీ’ (హిందీ అయితే... ఒకవేళ వేరే భాష అయితే ఆ భాష) అని కమాండ్‌ ఇవ్వాలి. దీని కోసం మీ మొబైల్‌లో ఎలాంటి సెట్టింగ్స్‌ మార్చాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సహా, ఆండ్రాయిడ్‌ గో  ఫోన్లలోనూ ఈ ఫీచర్‌ను వాడొచ్చు. దీంతోపాటు కాయ్‌ ఓఎస్‌ ఆధారంగా పనిచేసే డివైజ్‌ వినియోగదారులకూ ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle