newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీరు టీనేజ్ పిల్ల‌ల త‌ల్లిదండ్రులా.. అయితే జాగ్ర‌త్త‌..!

06-05-202006-05-2020 07:50:59 IST
Updated On 06-05-2020 09:56:37 ISTUpdated On 06-05-20202020-05-06T02:20:59.282Z06-05-2020 2020-05-06T02:20:55.553Z - 2020-05-06T04:26:37.801Z - 06-05-2020

మీరు టీనేజ్ పిల్ల‌ల త‌ల్లిదండ్రులా.. అయితే జాగ్ర‌త్త‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌మ పిల్ల‌లు బాగా చ‌దువుకొని త‌మ‌ను ఉద్ధ‌రిస్తార‌ని ఆశ‌ప‌డ‌తారు త‌ల్లిదండ్రులు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పిల్ల‌ల‌కు మంచి విద్య అందించాల‌ని పెద్ద పెద్ద స్కూళ్ల‌లో వేసి అప్పుల పాల‌వుతుంటారు. తాము ఎంత క‌ష్ట‌ప‌డినా త‌మ పిల్ల‌ల కోసమే కాదా, వారికి మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని క‌దా అనేది వారి తాప‌త్ర‌యం. పిల్ల‌లు ఏది అడిగితే అది ఇప్పిస్తుంటారు. హైస్కూల్ ద‌శ‌కు రాగానే స్మార్ట్ ఫోన్‌, ఇంట‌ర్నెట్ కామ‌న్ అయిపోయింది. అయితే, త‌మ పిల్ల‌ల‌కు ఫోన్ ఇప్పించి వారు దానిని చ‌దువుకు ప‌నికొచ్చేలా ఉపయోగించుకుంటున్నారేమో అని త‌ల్లిదండ్రులు ఆశ ప‌డుతుంటారు.

ఇలా గుడ్డిగా పిల్ల‌ల‌పై న‌మ్మ‌కం, గారాబంతో వారిని వ‌దిలేయ‌వ‌ద్ద‌ని చెబుతోంది తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఓ దారుణ ఉదంతం. స‌భ్య‌‌స‌మాజం త‌ల‌దించుకునేలా, పిల్ల‌ల భ‌విష్య‌త్‌పై భ‌యప‌డేలా కొంద‌రు విద్యార్థులు చేసిన ప‌నులు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని పెద్ద పెద్ద స్కూళ్ల‌లో చ‌దివే విద్యార్థులు ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు.

త‌ర‌చూ ఫోన్లు ప‌ట్టుకొని కూర్చుంటుంటే త‌ల్లిదండ్రులు ఏదో ఆడుకుంటున్నారో లేదా చ‌దువుకు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేస్తున్నారో అని అనుకున్నారు. కానీ, వారంతా త‌ల్లిదండ్రుల ఊహ‌ల‌కు అంద‌రి దారుణ ప‌నులు చేశారు.

10 - 12 త‌ర‌గ‌తుల‌కు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్ పేరు బాయ్స్ లాక‌ర్ రూమ్‌. ఒక‌రి నుంచి ఒక‌రు, వారి నుంచి మ‌రొక‌రు ఇలా 50 మంది వ‌ర‌కు ఈ గ్రూప్‌లో చేరారు.

వీరంతా ఈ గ్రూప్‌లో పంపించుకున్న మెసేజ్‌లు, మాట్లాడిన మాట‌లు ఇప్పుడు జుగుప్సా‌క‌రంగా ఉన్నాయి. అమ్మాయిలు, వారి శ‌రీర అవ‌య‌వాల గురించి దారుణంగా మాట్లాడుకున్నారు. అమ్మాయిల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి ఈ గ్రూప్‌లో షేర్ చేసుకున్నారు. అమ్మాయిల‌ను రేప్ చేయాల‌ని, గ్యాంగ్ రేప్ చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.

ఏప్రిల్‌లో ఈ గ్రూప్ మొద‌లైంది. అయితే, ఈ గ్రూప్‌లోకి అనుకోకుండా ఓ విద్యార్థిని కూడా చేరింది. అబ్బాయిల మాట‌లు, ఛాటింగ్ చూసిన స‌ద‌రు అమ్మాయి వెంట‌నే గ్రూప్ ఛాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇవి వైర‌ల్‌గా మార‌డంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

ఢిల్లీ పోలీసులు ఈ సంఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకొని సుమోటోగా కేసు న‌మోదు చేసుకున్నారు. మొత్తం 26 మందిని గుర్తించి విచార‌ణ జ‌రుపుతున్నారు. ఒక‌వైపు ఈ విచార‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు బాయ్స్ లాక‌ర్ రూమ్ 2.0 అనే పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మ‌రో గ్రూప్ ఏర్పాటుకావ‌డం గ‌మ‌నార్హం. ఈసారి గ్రూప్‌లో ఫేక్ అకౌంట్ల‌తో చేరాల‌ని సైతం ఈ గ్రూప్ స‌భ్యులు ఆహ్వానిస్తున్నారు.

ఈ గ్రూప్ వివ‌రాలు కూడా పోలీసుల‌కు చిక్కాయి. దీంతో పెడ‌దారి ప‌ట్టిన విద్యార్థుల‌ను గుర్తించి, గ‌ట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అయితే, ఢిల్లీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అంద‌రికీ ఒక గుణ‌పాఠం లాంటిది.

త‌ల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న త‌మ పిల్ల‌ల ప‌ట్ల ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఈ ఘ‌ట‌న సూచిస్తోంది. టీనేజ్ పిల్ల‌ల‌పై, వారి ప్ర‌వ‌ర్త‌న‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా పిల్ల‌ల‌ను స్మార్ట్ ఫోన్లు, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల నుంచి వీలైనంత దూరంగా ఉంచ‌డం ఉత్త‌మం. ఇప్పుడు ఢిల్లీలో ఈ ఘ‌ట‌న భ‌య‌ట‌ప‌డింది. అలా అని ఇది కేవ‌లం ఢిల్లీకే ప‌రిమితం అని చెప్ప‌లేము. కాబ‌ట్టి, త‌ల్లిదండ్రులంతా త‌మ పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle