మీమ్స్ తయారీ కోసం ఫేస్బుక్ కొత్త యాప్..
21-11-201921-11-2019 13:01:04 IST
2019-11-21T07:31:04.127Z21-11-2019 2019-11-21T07:31:01.099Z - - 15-04-2021

సోషల్ మీడియాలో మాటల కంటే బొమ్మలదే హవా. ముఖ్యంగా మీమ్స్‌కే సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ. చెప్పాల్సిన విషయాన్ని వ్యంగ్యంగా బొమ్మల రూపంలో చెప్పడమే మీమ్. మీరూ చూసే ఉంటారు. అయితే వీటిని చేయడానికి బేసిక్ ఫొటో షాప్ అయినా కావాలి. కానీ మీలాంటి వారి కోసం ఫేస్బుక్ ఓ కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. దీంతో మొబైల్లోనే మీమ్స్‌ను తయారు చేసుకోవచ్చు అని చెబుతోంది. న్యూ ప్రోడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ డివిజన్ పేరుతో ఫేస్బుక్ నిర్వహిస్తున్న విభాగంలో ‘వేల్’ పేరుతో ఓ యాప్ క్రియేట్ చేశారు. దాంతోనే మీమ్స్ చేయొచ్చు.
వేల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా కెనడాలో విడుదల చేశారు. అక్క ఆపిల్ మొబైల్ వినియోగదారులు దీన్ని వాడుతున్నారు. త్వరలో మరిన్ని దేశాలకు దీన్ని విస్తరించే పనిలో ఫేస్బుక్ ఉంది. అయితే మన దేశానికి ఎప్పుడు తీసుకొస్తారనే విషయంలో స్పష్టత లేదు. మీ ఫోన్లో గతంలో తీసిన ఫొటో లేదా కొత్తగా తీసే ఫొటోతో మీమ్ చేయొచ్చు.
లేదంటే యాప్‌లోనే కొన్ని ఫోటోలు ఉంటాయి.. వాటిని వాడుకోవచ్చు. దానికి టెక్స్ట్, ఇమోజీ, ఫిల్టర్, ఎఫెక్ట్స్‌ను జోడించొచ్చు. దీంతోపాటు 2 గ్రిడ్, 3 గ్రిడ్, 4 గ్రిడ్ లేఅవుట్స్‌ను ఎంచుకొని మీమ్ తయారు చేయొచ్చు. డ్రాయింగ్ వచ్చేవారి కోసం ఫ్రీఫామ్ డ్రాయింగ్ టూల్ కూడా ఉంది. దీని ద్వారా మీకు కావాల్సిన బొమ్మను గీసుకోచ్చు.

ఫేస్బుక్ ఎన్పీఈ టీమ్‌ను ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. యాప్స్ విషయంలో ప్రయోగాలు చేయడమే ఈ సంస్థ పని ప్రకటన సమయంలో తెలిపింది. ఈ క్రమంలో ఆక్స్, బంప్ పేరుతో రెండు యాప్స్ రూపొందించింది. ఛాటింగ్ ప్రధానంగా సాగేది బంప్ అయితే, మ్యూజిక్ వినడానికి ఉపయోగపడేది ఆక్స్ యాప్. ఈ రెండు యాప్స్ ఈ నెల మొదట్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.
అయితే వీటిలో ఏదైనా యూజర్లకు పెద్దగా ఉపయోగపడదు అనుకుంటే వెంటనే మూసేస్తామని ఫేస్బుక్ చెబుతోంది. అయితే ఇప్పుడు వరకు వచ్చిన మూడు యాప్స్ తరహాలోనివి ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆక్స్, బంప్, వేల్ యాప్స్ ఎలా వినియోగదారుల ఆదరణ చూరగొంటాయి, ఎన్ని రోజులు నిలుస్తాయనేది చూడాలి.



గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా