newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మార్కెట్ లోకి కొత్త ‘షావోమీ’ టీవీలొచ్చాయ్..!

18-09-201918-09-2019 11:10:02 IST
2019-09-18T05:40:02.354Z18-09-2019 2019-09-18T05:39:52.654Z - - 20-10-2019

మార్కెట్ లోకి కొత్త ‘షావోమీ’ టీవీలొచ్చాయ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాలో లాంచ్ అయిన చాలా రోజుల తర్వాత  షావోమీ భారత మార్కెట్ లోకి టీవీలను తీసుకొచ్చింది. లేట్ అయినా లేటెస్ట్ ఫీచర్లతో మొబైళ్లను ఆదరించినట్లే టీవీలనూ అందించింది. ఎంఐ4సి పేరుతో వచ్చిన ఆ 32 ఇంచీల టీవీని వినియోగదారులు ఆదరించారు కూడా. ఆ జోరులో ఎంఐ4ఎ సిరీస్ లో మరో రెండు టీవీలను తీసుకొచ్చింది. అవీ హిట్ అయ్యాయి.  అందుకే షావోమీ మరో నాలుగు టీవీలను ఈ రోజు విడుదల చేసింది. 

షావోమీ స్మార్ట్ లివింగ్ -2020 పేరుతో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో MI TV 4X సిరీస్ లో 65 ఇంచీలు, 50 ఇంచీలు, 43 ఇంచీల టీవీలు లాంచ్ చేశారు. MI TV 4A సిరీస్ లో  40 ఇంచీల టీవీని కూడా ఆవిష్కరించారు.  కొత్త టీవీల్లో పాచ్ వాల్ ను 2.0కి అప్ డేట్ చేశారు. దీంతోపాటు ఎంఐ టీవీల్లో నెట్ ఫ్లిక్స్ సపోర్టును తీసుకొచ్చారు. 65 ఇంచీల టీవీ ధర  రూ. 54,999 గా నిర్ణయించారు. 50 ఇంచీల టీవీని రూ. 29,999కి... 43 ఇంచీల టీవీని రూ. 24,999 అమ్మనున్నారు. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ను ఇంటిగ్రేట్ చేశారు. దీంతోపాటు ఇందులో డేటా సేవర్ ఫీచర్ను తీసుకొస్తున్నారు. దీని వల్ల మూడింతల తక్కువ డేటా ఖర్చవుతుందట. 

కొత్త టీవీలన్నీ ఈ నెల 29  నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.  అయితే 65 ఇంచీల మోడల్ మాత్రం ఆ రోజు నుంచి ప్రీ ఆర్డర్ తీసుకుంటారు. మిగిలినవన్నీ కొనుగోలు  చేయొచ్చు. అమెజాన్, ఎంఐ.కామ్ లో కొనుగోలు చేయొచ్చు. త్వరలో ఎంఐ హెమ్స్, ఇతర పార్టనర్స్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు. లాంచింగ్ ఆఫర్ కింద ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ ని ఒక నెలపాటు ఉచితంగా పొందొచ్చు. అయితే దీని కోసం ఆరు నెలల సబ్ స్క్రిప్షన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle