newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహిళా దినోత్సవం స్పెషల్.. గూగుల్ డూడుల్

08-03-202008-03-2020 11:06:43 IST
Updated On 08-03-2020 11:09:18 ISTUpdated On 08-03-20202020-03-08T05:36:43.903Z08-03-2020 2020-03-08T05:36:24.421Z - 2020-03-08T05:39:18.225Z - 08-03-2020

 మహిళా దినోత్సవం స్పెషల్.. గూగుల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సెర్జింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ప్రముఖల పుట్టిన రోజులు, ఆవిష్కరణల సమయంలో గూగుల్ ఇలా స్పెషల్ డూడుల్ పెట్టి తమ అభినందనలు, శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది. ప్రతి సందర్భాన్ని డూడుల్ రూపంలో రూపొందించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది గూగుల్.

ఈసారి మాత్రం విభిన్నంగా వీడియో రూపంలో తీసుకువచ్చింది గూగుల్. కొన్ని లేయర్లుగా త్రీడీ పేపర్ మండల యానిమేషన్ వీడియోను ఉమెన్స్ డే 2020కి అందించారు. 1900 నుంచి నేటి వరకు లింగ సమానత్వం కోసం, కార్మికుల పోరాటాలు చేసిన విషయాన్ని కొన్ని లేయర్ల రూపంలో చిత్రీకరించారు. వీడియో మొదటి భాగంలోని నలుపు-తెలుపు లేయర్ 1800ల నుంచి 20వ శతాబ్దం వరకు పనిలో సమాన వేతనం, సమాన హక్కులు కోరిన విషయాన్ని చాటి చెబుతోంది.

సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. రాజకీయనేతలు ఎంతగా ఊదరగొట్టినా మహిళలకు రాజ.కీయరంగంలో సముచితమయిన స్థానం లభించడంలేదనేది వాస్తవం. 

ఓస్లో, లండన్‌కు చెందిన ఆర్టిస్టులు జూలీ విల్కిన్ సన్, మెకెరీ స్టూడియోకి చెందిన జోయాన్నే హార్స్ క్రాఫ్, జ్యూరిచ్‌కు చెందిన గెస్ట్ యానిమేటర్లు మారియన్ విలియం, డాప్నే అబ్డర్ హల్డెన్‌లు కలిసి తరతరాలుగా మహిళల విశిష్టత, ప్రాముఖ్యతను వివరించేలా నిమిషం లోపే నిడివి ఉన్న గూగుల్ డూడుల్‌ వీడియోను రూపొందించారు.

గతంతో పోలిస్తే మహిళల సాధికారిత పెరిగింది. ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అదేవిధంగా మహిళలపై దాడులు కూడా పెరిగాయి.నిర్భయ,దిశ, సమత..వంటి ఉదంతాలు మనం ఇంకా అనాగరికమయిన సమాజంలోనే బతుకతున్నామని గుర్తుచేస్తుంటాయి. కఠినమయిన చట్టాలు వున్నా వాటిని సమర్థంగా అమలుచేయలేకపోతున్నాం. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle