newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్ళీ ఫేస్‘బుక్’ అయ్యింది

15-12-201815-12-2018 13:39:04 IST
Updated On 15-12-2018 13:39:02 ISTUpdated On 15-12-20182018-12-15T08:09:04.849Z15-12-2018 2018-12-15T08:09:02.321Z - 2018-12-15T08:09:02.324Z - 15-12-2018

మళ్ళీ ఫేస్‘బుక్’ అయ్యింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా దిగ్గజంగా ఓ ఊపు ఊపేస్తున్న ఫేస్‌బుక్‌కి ఈమధ్య టైం బ్యాడ్‌గా నడుస్తోంది. అసలు తిరుగేలేదనుకున్న ఈ నెట్‌వర్క్ పదేపదే హ్యాకర్ల చేతుల్లో బుక్ అవుతోంది. యూజర్ల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచే ఫేస్‌బుక్ ఇప్పుడు వరుస లీకుల బారిన పడుతోంది. ఇప్పటికే యూజర్ల డేటా దుర్వినియోగం, ఖాతాల హ్యాకింగ్‌ లాంటి వివాదాలతో సతమతమవుతున్న ఫేస్‌బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఒక లోపం కారణంగా దాదాపు 68లక్షల మంది యూజర్ల ఫొటోలు ఓ థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ ద్వారా బహిర్గతమయ్యాయి.

ఫేస్‌బుక్‌ లాగిన్‌తో యూజర్లు థర్డ్‌ పార్టీ యాప్‌లకు తమ ఫొటో యాక్సెస్‌ అనుమతి ఇస్తుంటారు. అయితే... ఇందులో ఏర్పడిన లోపం కారణంగా యూజర్లు పోస్టు చేయని ఫొటోలు కూడా యాప్‌ల ద్వారా బహిర్గతమైనట్లు ఫేస్‌బుక్‌ గుర్తించింది. ‘‘ఫేస్‌బుక్‌ ఫొటోలను యాక్సెస్‌ చేసుకునేందుకు యూజర్లు థర్ట్ పార్టీ యాప్‌లకు అనుమతి ఇస్తుంటారు. అప్పుడు కేవలం యూజర్ల టైమ్‌లైన్‌లో ఉన్న ఫోటోలు మాత్రమే యాక్సెస్‌ చేసుకునేందుకు మేం వీలు కల్పిస్తాం! కానీ... ఫేస్‌బుక్‌లో తలెత్తిన బగ్‌ కారణంగా మార్కెట్‌ ప్లేస్‌ లేదా ఫేస్‌బుక్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన ఫొటోలను కూడా యాప్‌లు యాక్సెస్‌ చేసుకోగలిగాయి’’ అని సంస్థ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ తోమర్‌ బార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

సెప్టెంబరు 13 నుంచి 25 వరకు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని, ఆ టైంలో దాదాపు 68లక్షల మంది యూజర్ల పోస్టు చేయని ఫొటోలు బటయపడ్డాయని బార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దాన్ని సరిచేశామని, ఈ పొరపాటు జరిగినందుకు తాము యూజర్లకు క్షమాపణలు తెలిపామన్నారు. బగ్‌ ప్రభావిత యూజర్ల ఫొటోలను ఫేస్‌బుక్‌ నుంచి డిలీట్‌ చేసే పనిలో ఉన్నట్లు బార్ వెల్లడించారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle