మరో సెన్సేషన్‌కు జియో రెడీ!
19-02-201919-02-2019 16:36:39 IST
2019-02-19T11:06:39.286Z19-02-2019 2019-02-19T11:06:37.173Z - - 14-04-2021

దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోందా? ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్‌లో కొత్త ప్రొడక్ట్‌ల గురించి ముకేష్ అంబానీ ప్రకటనలు చేస్తారు. త్వరలో జరగబోయే 42 యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్‌లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏం అనౌన్స్ చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో ఉద్యోగుల సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ , జియోఫోన్ 3 మరియు జియో డీటీహెచ్ సర్వీస్ గురించి అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అన్నీ కుదిరితే జులై నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. జియో గిగా ఫైబర్ ప్రారంభమయితే నాణ్యమయిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు. ఇదే కాకుండా జియో ఫోన్ 3 గురించి వార్తలు వస్తున్నాయి. జియోఫోన్-3లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ గో, 2జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ కానుంది. వీటన్నిటికి తోడు జియో డీటీహెచ్ సేవలు ప్రారంభం కానున్నాయి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా