newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మధుబాలపై గూగుల్ డూడుల్

14-02-201914-02-2019 07:41:44 IST
2019-02-14T02:11:44.983Z14-02-2019 2019-02-14T02:11:38.676Z - - 15-04-2021

మధుబాలపై గూగుల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పటి అందాల భామ మధుబాల అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి. హిందీ చిత్రరంగంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె 86వ జయంతి సందర్భంగా ఇంటర్నెట్ సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది.

మధుబాల 1950-1960  దశకంలో  విజయవంతమైన చిత్రాలలో నటించారు. తన సమకాలికులైన నర్గీస్ , మీనా కుమారిలతో పాటు క్రేజ్ పొందారు. న్యూఢిల్లీలో 1933 ఫిబ్రవరి 14న ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. మొహమ్మద్జాయ్ రాజవంశ శాఖకు చెందిన కాబూల్ నవాబి కుటుంబ సభ్యులు. ఈమె తాతలు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుండి భారతదేశానికి  పంపబడ్డారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవవారు.

మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన తరువాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. ముంతాజ్ తొమ్మిదేళ్ళ వయసులోనే చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. మధుబాల తొలి చిత్రం బసంత్ 1942లో విడుదల బాక్సాఫీస్ హిట్ అయింది. ముంతాజ్ పేరుతో ఉన్న మధుబాలకు ఆ పేరు సూచించింది నటీమణి దేవికా రాణి. ఆమె నటనకు, సామర్ధ్యానికి ముగ్దురాలైంది. నిర్మాత కిదార్ శర్మ ఆమెను రాజ్ కపూర్‌  సరసన 1947లో నీల్ కమల్ చిత్రంలో  అవకాశం ఇచ్చారు. అప్పటికి ఆమె వయసు 14ఏళ్ళు. మధుబాల నటన అందరినీ ఆకట్టుకుంది.

బోంబే టాకీస్ చిత్రం మహల్ 1949లో విడుదలైంది. దీంతో మధుబాల అత్యంత ప్రజాదరణ పొందారు. ఆయేగా ఆనేవాలా అనే పాట ఇద్దరు సూపర్ స్టార్ల ప్రవేశాన్ని సూచించింది. 1950లో  మధుబాల గుండె సమస్యతో ఇబ్బంది పడ్డారు. కానీ హార్ట్ సర్జరీ చేయించుకోలేదు. అయితే  ఎస్ఎస్ వాసన్ చిత్రం ‘బహుత్ దిన్ హుయే’ మద్రాస్‌లో  షూటింగ్ జరుగుతుండగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కానీ ఆమె పరిస్థితి పూర్తిగా వికటించి, 1969లో 36 ఏళ్ళ వయసులో  మరణించారు. 

ఆమెకు సూపర్-స్టార్ స్థాయిని తెచ్చిన చిత్రం మొఘల్-ఏ-ఆజం. దిలీప్ కుమార్‌తో ఆమె సహజీవనం చేశారని చెబుతారు. మధుబాల 70కి పైగా చిత్రాలలో నటించారు. మధుబాలకు 12 ఏళ్ళ వయసులో  మోహన్ సిన్హా ఆమెకు కారు నడపడంలో శిక్షణ ఇచ్చారు. ఆమె హాలీవుడ్ చిత్రాలకు విపరీత అభిమాని. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle