newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మడతబెట్టేందుకు మైక్రోసాఫ్ట్ రె‘ఢీ’

03-12-201803-12-2018 16:36:09 IST
Updated On 03-12-2018 16:36:07 ISTUpdated On 03-12-20182018-12-03T11:06:09.457Z03-12-2018 2018-12-03T11:06:07.831Z - 2018-12-03T11:06:07.833Z - 03-12-2018

మడతబెట్టేందుకు మైక్రోసాఫ్ట్ రె‘ఢీ’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హార్డ్‌వేర్ రంగంలో నిలదొక్కుకునేందుకు ‘మైక్రోసాఫ్ట్’ తన దూకుడు పెంచింది. యాపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు ఓ సంచలన ప్రయోగం దిశగా పావులు కదిపింది. ప్రస్తుతం సర్ఫేస్ పేరుతో ల్యాప్‌టాప్‌లు విడుదల చేస్తున్న ఈ సంస్థ.... ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన టెక్‌ జర్నలిస్టు బ్రాడ్‌ శామ్స్‌ తాను రాసిన ‘బినీత్‌ సర్ఫేస్‌’ పుస్తకంలో వెల్లడించారు. ఇది ట్యాబ్ పరిమాణంలో ఉంటుందని... దీన్ని మడతపెట్టి స్మార్ట్‌‌ఫోన్‌ సైజులోకి మార్చుకోవచ్చని ఆయన తెలిపారు. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫోన్‌ను ‘అండ్రోమెడా’గా పిలుస్తారని, దీన్ని 2019 చివరినాటికి ఆవిష్కరించవచ్చునని శామ్స్‌ వెల్లడించారు. అధికారికంగా లాంచ్ చేసినప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తారు. రెండు వైపులా స్ర్కీన్‌ ఉండడంతో... శాంసంగ్‌ అభివృద్ధి చేసిన ఫోల్డబుల్‌ ఫోన్‌ తరహాలోనే ఈ ఫోన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన సర్ఫేస్‌ ల్యాప్‌ట్యాప్‌ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ బాగా ఉంది. అలాగే ఈ ఫోల్డబుల్ ఫోన్‌కి ఆదరణ లభిస్తే... మైక్రోసాఫ్ట్‌కి ఇక తిరుగే ఉండదంటున్నారు టెక్నికల్ నిపుణులు!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle