మడతపెట్టే ల్యాప్ టాప్ ఇదిగో!
15-05-201915-05-2019 16:00:19 IST
Updated On 15-05-2019 16:00:16 ISTUpdated On 15-05-20192019-05-15T10:30:19.317Z15-05-2019 2019-05-15T10:29:11.881Z - 2019-05-15T10:30:16.516Z - 15-05-2019

ఒకప్పుడు డెస్క్ టాప్లు వాడేవారు. ఇతర ప్రాంతాలకు మోసుకెళ్ళడం, అక్కడ పనిచేయడం చాలా శ్రమతో కూడుకున్నదిగా ఉండేది. తర్వాత ల్యాప్ టాప్, పాంట్యాప్ లు, నోట్ బుక్స్ వచ్చేశాయి. వీటితో పని చాలా సులువుగా అయిపోతోంది. ప్రపంచంలోనే మడతపెట్టే ల్యాప్ ట్యాప్ చూశారా. అయితే ఇదిగో చూసెయ్యండి. లెనోవో కంపెనీ ఈమధ్యే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసక్తికరంగా లెనోవో ఇప్పుడు ఫోల్డబుల్ స్క్రీన్ డివైస్ ను ఆవిష్కరించింది కానీ అది స్మార్ట్ ఫోన్ కాదు ల్యాప్ టాప్.ఇది ఫోల్డబుల్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. థింక్ ప్యాడ్ X1 పేరుతో ఉన్న ఈ డివైస్ కంపెనీ యొక్క వార్షిక అమ్మకాల కార్యక్రమంలో ప్రదర్శించారు. లెనోవా థింక్ ప్యాడ్X1 ఫోల్డబుల్ చేయగల స్క్రీన్ లాప్ టాప్ యొక్క నమూనా ప్రత్యేకంగా రూపొందింది. సాంప్రదాయ ల్యాప్టాప్ ఆకారంలో ఉన్నా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనిని మనకు అనుకూలంగా మడిచి పనిచేసుకోవచ్చు. స్క్రీన్ పై కోణాలు ఉంటాయి. వాటి ఆధారంగా వీటిని మనం వంచవచ్చు. ఇది 13.3-inch హై-రిజల్యూషన్ డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ మైక్రో సాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని లెనోవో సంస్థ గత మూడు సంవత్సరాలుగా వివిధ పరీక్షల్లో ఉంచింది. 2020లో ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది లెనోవో. దీనికి సంబంధించిన ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా