newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

భారత్ బాటలో అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం వైపు అడుగులు

07-07-202007-07-2020 12:36:31 IST
2020-07-07T07:06:31.566Z07-07-2020 2020-07-07T07:06:19.776Z - - 04-08-2020

భారత్ బాటలో అమెరికా.. టిక్ టాక్ పై నిషేధం వైపు అడుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టిక్ టాక్ పై భారత్ నిషేధం విధించింది. దీంతో టిక్ టాక్ భారీగా నష్టపోతోంది. చైనా-భారత్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలతో టిక్ టాక్ తో పాటు 59 యాప్ లపై నిషేధం అమలులోకి వచ్చింది. ఇప్పుడు భారత్ బాటలోనే నడవనుంది అమెరికా. చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లను బ్యాన్ చేసేందుకు అమెరికా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

టిక్ టాక్ పై నిషేధానికి సంబంధించి స్వయంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందే చెప్పడం ఇష్టం లేకపోయినా.. చైనీస్ యాప్స్‌ను నిషేధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పాంపియో చెప్పారు. టిక్ టాక్ యాప్ సేకరించే యూజర్ల డేటాపై యూఎస్ చట్టసభ్యులు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

టిక్ టాక్ కారణంగా వ్యక్తిగత గోప్యతకు,  అమెరికా జాతీయ భద్రతకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి దేశీయ కంపెనీలు.. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉంటూ.. అక్కడి కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని వారు అన్నారు. భారత ప్రభుత్వం చైనా యాప్స్‌పై విధించిన నిషేదాన్ని పాంపియో సమర్ధించారు.

అయితే టిక్ టాక్ సేకరించిన డేటా గురించి భారతీయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. టిక్ టాక్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల యూజర్లలో 11 కోట్ల మంది భారతీయులే వున్నారు. వీరంతా టిక్ టాక్ ద్వారా వీడియోలు తీసి ప్రాచుర్యం పొందారు.  ఈ యాప్ నుంచి యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే ఆ దేశపు యాప్ లను భారతదేశం బ్యాన్ చేసింది. అయితే టిక్ టాక్ మాత్రం భారత్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. భారతీయుల డేటాను సింగపూర్ లో దాచినట్టు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ డేటా భద్రత గురించిన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle