భారత్‌లో తొలి 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల.. షావోమీదే చరిత్ర
20-03-202020-03-2020 08:31:04 IST
2020-03-20T03:01:04.408Z20-03-2020 2020-03-20T03:00:56.395Z - - 11-04-2021

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తోంది. జియోమి ఫ్లాగ్షిప్ Mi 10 స్మార్ట్ ఫోన్ భారత్‌లో త్వరలో విడుదల కానుంది. సోషల్ మీడియాలో డజన్ల కొద్దీ చానల్స్‌లో టీజర్లు వదిలి భారత వినియోగదారులను ఊరించిన షావోమి ఎట్టకేలకు ఈ అధునాతనమైన 5 జీ స్మార్ట్ ఫోన్ విడుదలను అధికారికంగా ప్రకటించింది. ఇది 108 మెగా పిక్సెల్‌తో దేశంలో విడుదల అవుతున్న తొలి స్మార్ట్ ఫోన్ కావడం విశేషం. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్‌ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఆన్లైన్లో సేల్ ప్రారంభం. 12 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకానుంది. ధర రూ. 42,500 నుంచి ప్రారంభం కానుందని అంచనా. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్ బ్యాక్ సదుపాయం. డెబిట్ కార్డ్ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్ సదుపాయం కూడా వినియోగదారలకు లభ్యం కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే లభ్యమవుతున్న ఈ తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌కి ఆ దేశంలో 3,999 యువాన్ల ధరను నిర్ణయించారు. అంటే మన దేశం రూపాయల్లో ఇది రూ. 42,500లు అవుతుంది. కానీ భారతదేశంలోకి వచ్చేసరికి దీని ధర మరింత పెరగవచ్చు. ఎందుకంటే ఇటీవలే కేంద్రప్రభుత్వం మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచింది. ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు 6.67 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ 20 ఎంపీ సెల్పీ కెమెరా 108+13+ 2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమేరా 4780 బ్యాటరీ సామర్థ్యం

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
13 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా