భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. సరకు రవాణాకు సాటిలేని వాహనం
14-03-202014-03-2020 09:17:47 IST
2020-03-14T03:47:47.027Z14-03-2020 2020-03-14T03:47:39.753Z - - 17-04-2021

ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్టౌ.. ఇలా డీజిల్, పెట్రోల్ తదితర ఇంధనాలతో పనిలేకుండా విద్యుత్‌తో పనిచేసే వాహనాలు, ఉపకరణాలన గురించి చాలాకాలంగా వింటున్నాం. కానీ దేశచరిత్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గురించి ఇప్పుడే వింటున్నాం.
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సెలెస్ట్రియల్ ఈ–మొబిలిటీ రూపొందించింది. వినియోగానికి వీలున్న నమూనాను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఉద్యానవనాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ దురైరాజన్ మీడియాకు తెలిపారు.
‘ధర రూ.5 లక్షల లోపు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందుకోవచ్చు. డీజిల్ ట్రాక్టరుతో గంటకు రూ.150 ఖర్చు వస్తే, దీనికి రూ.20–35 మధ్య ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వేగం గంటకు 20 కిలోమీటర్లు. 5–8 ఏళ్లు బ్యాటరీ మన్నికగా ఉంటుంది. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యంతో బాలానగర్‌లో ఫ్యాక్టరీ ఉంది. రూ.60 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని వివరించారు.
అయితే సెలెస్టియల్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనా భారత్‌కు కొత్త కాదు. 2017లోనే ట్రాక్టర్ ఉత్పత్తి సంస్థ ఎస్కార్ట్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ప్రదర్శించింది. కానీ ఆ మోడల్ సీరీస్ ఉత్పత్తికి ఇంకా నోచుకోలేదు. ఈ నేపథ్యంలో సెలెస్టియల్ ఇ-మొబిలిటీ సంస్థ 2020 చివరినాటికి తన కొత్త ఇ-ట్రాక్టర్‌ను తీసుకురావాలని పథకం రచన చేస్తోంది.
అన్నీ సజావుగా జరిగితే వచ్చే మూడేళ్లలో 8,000ల ఇ- ట్రాక్టర్లను తయారు చేస్తామని కంపెనీ చెబుతోంది. ఇప్పటికైతే నమూనాగా మాత్రమే ఉన్న ఇ-ట్రాక్టర్ని సరైన మార్కెట్లో లాంచ్ చేయడానికి అవసరమైన సర్టిఫికెట్ల సాధనపై కంపెనీ దృష్టి పెడుతోంది.
దేశీయ ట్రాక్టర్ల మార్కెట్లో 2019లో 8,78,999 ట్రాక్టర్లను వాహన తయారీ సంస్థలు అమ్మాయి. కాబట్టి ఈ తరుణంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాల ఆశ. జీరో ఎమిషన్ పర్యావరణ అనుకూల లక్ష్యంతో కూడిన ఇ-ట్రాక్టర్ వ్యవసాయపరంగా, పారిశ్రామిక పరంగా అన్నిరకాల అవసరాలకు ఉపయోగపడతుందని సెలెస్ట్రియల్ ఈ–మొబిలిటీ ధీమాగా చెబుతోంది.



గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా