newssting
BITING NEWS :
* టీడీపీలో సంక్షోభం.. నలుగురు రాజ్యసభ ఎంపీల తిరుగుబాటు.. తమను బీజేపీలో విలీనం చేయాలని లేఖ *టీడీపీ రాజ్యసభ ఎంపీలకు స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా * పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ *కాకినాడలో కాపు నేతల రహస్య సమావేశం *టీటీడీ చైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ రాజీనామా*లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా *కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

భారత్‌లో ఓటుహక్కు బాధ్యతపై గూగుల్ డూడుల్

11-04-201911-04-2019 10:10:48 IST
Updated On 11-04-2019 10:19:44 ISTUpdated On 11-04-20192019-04-11T04:40:48.485Z11-04-2019 2019-04-11T04:40:42.483Z - 2019-04-11T04:49:44.425Z - 11-04-2019

భారత్‌లో ఓటుహక్కు బాధ్యతపై గూగుల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో ఓటుహక్కు బాధ్యతపై సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ రూపొందించింది. ఎన్నికలు, ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తోంది. భారతీయ పౌరులంతా తప్పక ఓటు వేయాలని కోరుతోంది. ఈనెల 11 వ తేదీ నుంచి మే 19 వరకూ ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు ఇండియాలో ఇప్పుడు జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్‌ సందర్భంగా ప్రత్యేకంగా డూడుల్‌ను రూపొందించింది గూగుల్. ఈ ఎలక్షన్ గూగుల్ డూడుల్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అర్హులైన వారంతా ఓటు వేయాలంటూ ప్రతి పౌరుడి బాధ్యతను తెలియజేసింది. గూగుల్ చేసిన ప్రయత్నంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డూడుల్‌ గుర్తు చేస్తోంది. 'GOOGLE'లో .. రెండో 'O'ను చూపుడు వేలు మీద సిరా గుర్తు ఉండేలా రూపొందించారు. 

డూడుల్‌లో ఓటరుకు అవసరమైన కీలక సమాచారం మొత్తాన్ని గూగుల్ ప్రత్యేకంగా అందించింది. అభ్యర్థుల పేర్లు, ఓటర్ల జాబితా, ఓటరు కార్డు లేకపోతే ఏ, ఏ కార్డులతో ఓటేయొచ్చో కూడా తెలియజేయడం విశేషం. పోలింగ్ బూత్‌లు ఎక్కడున్నాయో కూడా గుర్తించేలా సమాచారాన్ని పొందుపరిచారు. ఓటు ఎలా వేయాలి.. ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చూసుకోవాలి. పోలింగ్ బూత్లో ఎలాంటి నిబంధనల్ని పాటించాలి అనే అంశాలను కూడా పొందుపరిచారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle