newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

భారత్‌కు లక్షలాది ‘ఎన్‌95’ మాస్కుల ఉచిత పంపిణీకి షావోమి సిద్ధం

25-03-202025-03-2020 14:39:36 IST
2020-03-25T09:09:36.273Z25-03-2020 2020-03-25T09:09:33.490Z - - 09-04-2020

భారత్‌కు లక్షలాది ‘ఎన్‌95’ మాస్కుల ఉచిత పంపిణీకి షావోమి సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్‌95 మాస్కులను లక్షల సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేస్తోంది. వైరస్‌ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాతృత్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. 

సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.  

మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న షావోమీ ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యతతో కూడిన ఎన్95 మాస్కులను ప్రభుత్వ ఆసుపత్రులకు అందించనున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. అలాగే ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డాక్టర్లకు అత్యవసరమైన హజ్‌మట్ బాడీ సూట్లను కూడా షావోమీ విరాళంగా అందించనుంది.

షావోమీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తన ఉద్యోగులను ఇప్పటికే వాణిజ్య పర్యటనలకు, విదేశీ యాత్రలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. తన ఉద్యోగులను, వ్యాపార భాగస్వాములను బహిరంగ స్థలాల్లో మాస్కులను ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు. 

అలాగే దేశంలోని తన కార్పొరేట్ ఆఫీసులు, వేర్ హౌస్‌లు, సర్వీస్ కేంద్రాలు, ఎమ్ఐ హోమ్ మరియు తయారీ ప్లాంట్లు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌కు పూర్తిగా కట్టుబడి ఉంటాయని జైన్ హామీని ఇచ్చారు.

 

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

   7 hours ago


సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

   9 hours ago


నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

   07-04-2020


ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

   07-04-2020


వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

   05-04-2020


క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

   04-04-2020


కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

   03-04-2020


కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

   02-04-2020


కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

   02-04-2020


హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

   01-04-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle