భారత్‌కు గూగుల్ బంపరాఫర్.. 75వేల కోట్ల పెట్టుబడులు
13-07-202013-07-2020 17:41:30 IST
Updated On 13-07-2020 18:14:10 ISTUpdated On 13-07-20202020-07-13T12:11:30.219Z13-07-2020 2020-07-13T12:11:18.774Z - 2020-07-13T12:44:10.417Z - 13-07-2020

భారత్ పట్ల గూగుల్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో వుంటుంది. అందుకే ఈసారి భారత్ పట్ల గూగుల్ సారథి, భారతీయుడైన సుందర్ పిచాయ్ కరుణ చూపించారు. రాబోయే ఏడు సంవత్సరాలలో భారతదేశంలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 75,000 కోట్లు అన్నమాట. గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు. ఈ మొత్తం హిందీ, తమిళం, పంజాబీ సహా ప్రతి భారతీయ భాషలోని సమాచారాన్ని ప్రతి దేశస్థుడికి తెలియజేయడానికి ఉపయోగించనున్నారు. ఇదేకాకుండా, ఈ నిధులు భారత ప్రజల అవసరాలను తీర్చడానికి కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. డిజిటల్ ఇండియాకు ఈ సాయం బాగా ఉపకరించనుంది. గూగుల్ ఫర్ ఇండియా ప్రోగ్రాంను ఉద్దేశించి పిచాయ్ మాట్లాడారు. 'గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్' ప్రకటించడం ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టనుందని పిచాయ్ చెప్పారు. దీనివల్ల భారత డిజిటల్ ఎకానమీపై సంస్థ యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పెట్టుబడులు భారతదేశ డిజిటలైజేషన్‌కు సంబంధించిన నాలుగు ముఖ్య అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి భారతీయుడికి వారి స్వంత భాషలో సమాచారం అందించడం, భారతదేశం యొక్క స్వంత అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, డిజిటల్ పరివర్తన ప్రకారం వ్యాపారాలను సాధికారపరచడం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వాడకం ఉన్నాయి. గూగుల్ సంస్థ ఇప్పటికే భారతదేశంలో వైఫై సేవలను విస్తృతం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ విజన్, మంత్రులు రవిశంకర్ ప్రసాద్, డా.ఆర్పీ నిశాంక్ సహాయ సహకారాలను ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ ప్రశంసించారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా