newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భయపెడుతున్న ‘జ్యూస్ జాకింగ్’

03-01-201903-01-2019 18:15:36 IST
2019-01-03T12:45:36.242Z03-01-2019 2019-01-03T12:45:33.954Z - - 14-04-2021

భయపెడుతున్న ‘జ్యూస్ జాకింగ్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతోందో... సైబర్ నేరాలు అంతే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీ మాటున కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు! ఇప్పటికే ‘మాల్‌వేర్’తో అవతలి వ్యక్తుల ఖజానాతో పాటు వ్యక్తిగత సమాచారాల్ని దొంగలిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ చర్యలు కఠినతరం కావడంతో... మరో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే చార్జింగ్ పాయింట్!

ఈమధ్య ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లను ఎక్కడబడితే అక్కడ నిరంతరం వాడుతుండడంతో... చార్జింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రైల్వే స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్స్, ఇంకా షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటు చేసిన పాయింట్ల వద్ద చార్జింగ్స్ పెట్టుకుంటున్నారు. దీన్నే సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడేందుకు తమకు అనువుగా మార్చేసుకున్నారు.  ‘జ్యూస్‌ జాకింగ్‌’ పేరిట తెరమీదకొచ్చిన ఈ కొత్త తరహా మోసం ఇంకా నగరంలోకి చొరబడలేదు కానీ... అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు. అయినా... చార్జింగ్ పాయింట్ ద్వారా సైబర్ క్రైమ్ ఎలా సాధ్యపడుతుంది? అని అనుకుంటున్నారా?

చార్జింగ్‌ పాయింట్ల వద్ద నాలుగైదు యూఎస్‌బీ పోర్టులు అమర్చబడి ఉంటాయి. సైబర్ నేరగాళ్ళు దాని స్థానంలో అచ్చం అలాగే ఉండే మరో పోర్టును అమరుస్తారు. దానికి ఫోన్, ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసినప్పుడు... చార్జింగ్ ఎక్కుతున్నట్లు సంకేతం కనిపిస్తుంది. అదే టైంలో వాటిల్లో ఉన్న సమాచారమూ యూఎస్‌బి పోర్టు క్షణాల్లోనే దొంగలించేస్తుంది. అప్పుడు సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా వ్యక్తిగత సమాచారం అడ్డం పెట్టుకుని... బెదిరింపులకు పాల్పడుతారు. కాబట్టి... తస్మాత్ జాగ్రత్త!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle