newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

బ్లాక్‌హోల్ ఫోటో ఆవిష్కారం వెనుక ఆమె..?

12-04-201912-04-2019 17:04:55 IST
Updated On 13-04-2019 07:45:18 ISTUpdated On 13-04-20192019-04-12T11:34:55.459Z12-04-2019 2019-04-12T11:15:58.077Z - 2019-04-13T02:15:18.458Z - 13-04-2019

బ్లాక్‌హోల్ ఫోటో ఆవిష్కారం వెనుక ఆమె..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్.. ఇప్పడిదే హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఈ బ్లాక్ హోల్ ఎలా వుంటుంది.. ఫోటో ఏమైనా లభ్యమవుతుందా? అంటే ఇప్పుడు అవునంటున్నారు సైంటిస్టులు. బ్లాక్ హోల్ అనే పేరును వినడం తప్ప, దానికి సంబంధించిన ఫోటోలు మనకు ఎప్పుడూ లభించలేదు.

శాస్త్రవేత్తల రెండేళ్ల శ్రమ ఫలితంగా తొలిసారి బ్లాక్ హోల్ ఫోటో బయటకు వచ్చింది. మధ్యలో నల్లగా, చుట్టూ నారింజ రంగు తేజోవలయంతో ఇది కనువిందు చేస్తోంది. మానవ చరిత్రలో కృష్ణబిలాన్ని చిత్రం తీయం ఇదే మొదటిసారి. భారీ టెలీస్కోపును వినియోగించి, గురుత్వాకర్షణ సాయంతో మనకు కనిపించకుండా విశ్వంలో తిరుగుతున్న ఈ ఖగోళ వింతను శాస్త్రవేత్తలు కెమేరాలో బంధించారు. గడచిన మూడు దశాబ్దాలుగా చిత్రకారులు ఊహించి వేస్తున్న కృష్ణబిలం చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఉండడం విశేషం. 

బ్లాక్ హోల్ ఫోటో మానవాళి ముందు ఆవిష్కృతం కావడానికి కారణం అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటీ బౌమన్. మసాచుసెట్స్ లో చదువుకుంటున్నప్పుడు ఓ అల్గా రిథం రాశారు. దీని సాయంతోనే ఎన్నో వందల కోట్ల ఫ్రేమ్‌లను సేకరించి కృష్ణ బిలం ఫొటోను రాబట్టగలిగారు. ఆమె ప్రస్తుతం ఎంఐటీ హేయ్ స్టాక్ అబ్జర్వేటరీ, హార్వడ్ స్మిత్ సోనియన్సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ లో పనిచేస్తున్నారు.

అసలు బ్లాక్ హోల్ ఫోటో ఎలావుంటుందో ఈమె వెలుగులోకి తెచ్చారు. అనంతరం  బ్రసెల్, షాంఘై, టోక్యో, వాషింగ్టన్, శాంటియాగో, తైపాల్లో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మీడియా ముందుకు వచ్చి ఈ ఘనతను వివరించారు. ఎం 87 అనే నక్షత్రమండలంలోనిది ఈ బ్లాక్ హోల్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులు దీనిపై పరిశోధనలు సాగించి, తొలి చిత్రాన్ని సంపాదించగలిగారు. మన పాలపుంతకు 5.5 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలోని మెస్సియర్ 87 గెలాక్సీలో ఉన్న కృష్ణబిలాన్ని క్లిక్‌ ‌‌‌‌‌‌‌మనిపించారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ఈవెంట్‌‌‌‌‌‌‌‌ హారిజన్‌‌‌‌‌‌‌‌ టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌(ఈహెచ్‌టీ)ను వాడారు. మధ్యలో నల్లగా, చుట్టూ ఎర్రటి మంటలు, వేడి వాయువులు, ప్లాస్మాతో కలిసి అద్భుతంగా ఉందా ఫొటో. 

మన దగ్గరున్న బ్లాక్‌‌‌‌‌‌‌‌హోల్‌‌‌‌‌‌‌‌నూ ఈహెచ్‌‌‌‌‌‌‌‌టీ గుర్తించిందని సైంటిస్టులు చెబుతున్నారు. మరో విశేషం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌లలో రెండు భారత్‌లోనే వున్నాయి. ఒకటి పుణే దగ్గరలోని జియాంట్‌‌‌‌‌‌‌‌ మీటర్‌‌‌‌‌‌‌‌వేవ్‌ రేడియో టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌. రెండోది ఊటీ రేడియోటెలిస్కోప్‌‌‌‌‌‌‌‌. ఈ రెండూ కూడా సెంటీమీటర్‌‌‌‌‌‌‌‌, మీటర్‌‌‌‌‌‌‌‌ తరంగదైర్ఘ్యంలో పని చేస్తాయి.

కానీ సబ్‌ మిల్లీమీటర్‌‌‌‌‌‌‌‌ తరంగదైర్ఘ్యం సామర్థ్యం ఉంటేనే బ్లాక్‌‌‌‌‌‌‌‌హోల్స్‌‌‌‌‌‌‌‌ను కనుగొనే అవకాశం ఎక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే మన టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌లు కృష్ణబిలాలను చూడలేవంటున్నారు.  ‘ఈవెంట్‌‌‌‌‌‌‌‌ హొరైజన్‌‌‌‌‌‌‌‌ టెలిస్కోప్‌ ఎంత బాగా పని చేస్తుందో తెలుసా.. దీని ద్వారా ఢిల్లీలోని ఆర్మ్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌ను చూడవచ్చు. కన్యాకుమారిలోని పుస్తకాన్ని చదవొచ్చు. ఈ అన్ని టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌లతోనే బ్లాక్‌‌‌‌‌‌‌‌హోల్‌‌‌‌‌‌‌‌ ఫొటోలు తీసి, కలిపి ఒకే ఫొటోగా రూపొందించారు.  మొత్తం మీద బ్లాక్ హోల్ ఫోటో ఇప్పుడు ఆశ్చర్యం గొలుపుతోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle