newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

27-05-202027-05-2020 12:20:53 IST
Updated On 27-05-2020 13:21:18 ISTUpdated On 27-05-20202020-05-27T06:50:53.389Z27-05-2020 2020-05-27T06:50:33.853Z - 2020-05-27T07:51:18.341Z - 27-05-2020

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్‌పై ఇప్పటికే లాక్‌డౌన్‌ యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ వార్‌కూ దిగింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి తీసుకోవల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్‌డేట్స్‌ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. దీని పేరు ‘ఆరోగ్యసేతు’ యాప్‌. ఏప్రిల్ 2న నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వినియోగంలోకి వచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు.  ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్యేకంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్. లొకేషన్ డేటా, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఇది పనిచేస్తుంది.

ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది. ఈ యాప్‌లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా భారత ప్రభుత్వం బ్లూటూత్ బేస్ట్ కోవిడ్ 19 ట్రాకర్ అందుబాటులోకి తెచ్చింది. 

* మీరు వ్యాధి సోకిన వ్యక్తి పరిధిలోకి వస్తే వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది

*కోవిడ్ 19కి సంబంధించి అందుబాటులో వున్న వైద్య విధానాలు, ఉత్తమ సలహాలను నిపుణుల ద్వారా తెలియచేస్తుంది. 

*ఈ యాప్ ద్వారా ఎలాంటి సాంకేతిక చొరబాట్లు వుండవు. మీరిచ్చిన సమాచారం భద్రంగా వుంటుంది. ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్‌లలో  అందుబాటులో వుంది.

*యాప్ చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే రీతిలో డిజైన్ చేయబడింది. 11  భారతీయ భాషలలో అందుబాటులో వుంది. 

* ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఆరోగ్య సేతు’ పేరు నమోదు చేసిన వెంటనే యాప్‌ కనిపిస్తుంది. సూచనల ఆధారంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఓపెన్‌ చేయాలి.

* జీపీఎస్‌ ఆధారంగా లొకేషన్‌ ఎంపిక చేసుకున్నాక మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

* ప్రస్తుతం 11 భాషల్లో యాప్‌ అందుబాటులో ఉంది. జీపీఎస్, బ్లూటూత్‌ నిరంతరం ఆన్‌లో ఉండాలి. అప్పుడే ఈ యాప్‌ కరోనా సమాచారం, స్థానిక వివరాలు అందిస్తుంది.

 *మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరి దగ్గర ఈ యాప్ ఉందో అది వెతుకుతుంది. ఎవరైనా కరోనావైరస్ సోకిన వ్యక్తి మీకు సమీపంలో నివసిస్తున్నారా అన్న విషయం చెబుతుంది. జీపీఎస్ ద్వారా మీరు ఆ ఆ వ్యక్తిని ఎప్పుడైనా కలిశారా అన్న విషయం కూడా కనిపెట్టి చెప్పే ప్రయత్నం చేస్తుంది.

పేరు, మొబైల్ నెంబర్,  పురుషులా/స్త్రీలా/ ట్రాన్స్ జెండరా), వృత్తి, ప్రయాణాల వివరాలు, స్మోకింగ్ అలవాటు ఉందో, లేదో లాంటి వివరాలను యాప్ వినియోగదారులను అడుగుతుంది.

* యాప్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని భారత ప్రభుత్వం కరోనావైరస్ సంబంధిత డేటాబేస్ తయారు చేస్తుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దీన్ని ఉపయోగించుకుంటుంది.* సమాచారమంతా క్లౌడ్ స్టోరేజీలో ఉంటుంది. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన సూచనలు వినియోగదారులకు వస్తుంటాయి.

* కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు తప్ప మరే కారణానికీ ఇందులోని సమాచారాన్ని వినియోగించరు. ఎవరైనా వినియోగదారుడు యాప్ అన్ఇన్‌స్టాల్ చేస్తే, 30 రోజులకు క్లౌడ్ స్టోరేజీ నుంచి వారి సమాచారం డిలీట్ అయిపోతుంది.

మనదేశంతోపాటు దక్షిణ కొరియా, యూకె, ఫ్రాన్స్, అమెరికా, డబ్ల్యూహెచ్ వో వంటి సంస్థలు కరోనా ట్రాకింగ్ యాప్ ల పట్ల ఆసక్తి చూపించాయి. దక్షిణ కొరియాలో కరోనా కట్టడిలో కీ రోల్ ప్లే చేసింది కరోనా ట్రేసింగ్ యాప్. అలాగే సొంత యాప్ లాంచ్ చేసింది యూకే.త్వరలోనే కరోనా ట్రాకింగ్ యాప్ లాంచ్ చేయనున్నాయి ఫ్రాన్స్, అమెరికా. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుండేలా  సొంత కరోనా ట్రాకింగ్ యాప్ తీసుకొచ్చే పనిలో బిజీగా వుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పటికే 11 కోట్ల 55లక్షలు  భారతీయులు ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఇంకా చేసుకోవాల్సిన వారు చాలామందే ఉన్నారు. ప్రతి ఒక్కరు విధిగా ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే ఈ యాప్ పాత్ర కీలకం అని చెప్పాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle