బ్యాన్ చైనా ఎఫెక్ట్... హువావేకి పెద్ద దెబ్బ
29-07-202029-07-2020 13:23:01 IST
2020-07-29T07:53:01.442Z29-07-2020 2020-07-29T07:52:45.950Z - - 19-04-2021

బ్యాన్ చైనా ఎఫెక్ట్ చైనా కంపెనీలను చావుదెబ్బ తీస్తోంది. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతుండటం, టిక్‌టాక్ , పబ్ జి సహా ఆ దేశానికి చెందిన యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో మరో చైనా కంపెనీ హువావె లేఆఫ్ దిశగా అడుగులు వేస్తోంది. ఆ సంస్థ ఉద్యోగులను తొలగించనున్నట్టు నిర్ణయం ప్రకటించింది. హువావె లేఆఫ్‌ను ప్రకటించడం ఖాయమని, ఫలితంగా-60 నుంచి 70 శాతం వరకు భారతీయ ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఓ మీడియా కథనం కూడా ప్రచురించింది. రైల్వే, టెలికం మంత్రిత్వ శాఖలు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. దీంతో హువావే సంస్థ ఈ లక్ష్యాన్ని సవరించింది. 350 నుంచి 500 మిలియన్ డాలర్లకు కుదించింది. దీన్ని కూడా అందుకోవడం కష్టసాధ్యమనే అభిప్రాయం హువావే యాజమాన్యంంలో తలెత్తింది. దీంతో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలను చేపట్టింది. ఆర్ అండ్ డి పై కూడా దీని ప్రభావం అంతగా పడకపోవచ్చు. ఇందులో భాగంగా- ఉద్యోగులను 60 నుంచి 70 శాతం వరకు తగ్గించడానికి సన్నాహాలు చేస్తోంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగంలో పనిచేసే భారతీయ ఉద్యోగులను మాత్రం యధాతథంగా కొనసాగించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ టెలికం రంగానికి చెందిన పరిశ్రమలు కూడా హువావె వంటి చైనా కంపెనీలు తయారు చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నాయి. దేశంలో వివిధ రకాల టెలికాం ఉత్పత్తులను హువావే విక్రయిస్తోంది. స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ హువావే తన మార్కెట్ పెంచుకునే సమయంలో ఈ నిర్ణయం కంపెనీపై ప్రభావం కనపడనుంది, మరోవైపు బ్రిటన్‌లో మొబైల్ సేవలు అందించే కంపెనీలు ఈ ఏడాది తర్వాత హువావే కొత్త 5జీ ఉపకరణాలు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. 5జీ నెట్వర్క్ సేవలలో చైనా కంపెనీ హువావే పాత్రను అనేక దేశాలు తగ్గించనున్నాయి. అమెరికా కూడా తమ కంపెనీలు హువావేతో వ్యాపారం చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. దాని సహచర కంపెనీలను కూడా 5జీ నెట్వర్క్ నుంచి తొలగించాలని చెప్పింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కూడా అమెరికా బాటలోనే నడిచాయి.గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు ఈమధ్యే మార్కెట్లోకి వచ్చాయి.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా