బెంబేలెత్తిస్తున్న వాట్సాప్ ‘గోల్డ్ మెసేజ్’
16-01-201916-01-2019 18:11:48 IST
2019-01-16T12:41:48.943Z16-01-2019 2019-01-16T12:41:45.543Z - - 11-04-2021

ఒక బ్రాండ్‌కి మంచి ఆదరణ వచ్చిందంటే చాలు... ఆ వెంటనే నకిలీల బెడద మొదలైపోతుంది. దానికొచ్చిన క్రేజ్‌ని ఎన్‌క్యాష్ చేసుకోవడం కోసం... నకిలీ వ్యాపారం మొదలుపెట్టేస్తారు. ‘వాట్సాప్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌కు వరల్డ్‌వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉండడంతో... దానిలాగే మరెన్నో నకిలీ యాప్స్ పుట్టుకొచ్చేశాయి. వాట్సాప్‌కి మించి సౌకర్యాలు ఉంటాయంటూ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే... ఈ నకిలీ యాప్స్ మాటున హ్యాకర్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. ‘వాట్సాప్’కి కొత్త అప్డేట్ వచ్చిందంటూ మెసేజ్‌లు పంపిస్తూ... వాటి ద్వారా మాల్వేర్ను ఫోన్లో జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటిదే ‘వాట్సాప్ గోల్డ్’ పేరుతో ఒక మెసేజ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్‌ని క్లిక్ చేసి ‘వాట్సాప్’ని అప్డేట్ చేసుకోమని, ఫలితంగా ఎన్నో అధునాతన సౌకర్యాలు పొందవచ్చని అందులో ఉంది. ‘వాట్సాప్’ గోల్డ్ కలర్లోకి మారుతుందని, ఒకేసారి 100 ఫోటోలు పంపుకునే వీలుంటుందని ఆ మెసేజ్‌లో ఉంది. ఇది చూసి టెంప్ట్ అయి దాన్ని క్లిక్ చేస్తే మాత్రం... హ్యాకర్ల చేతిలో అడ్డంగా బుక్ అవుతారని McAfee India వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ వెంకట్ కృష్ణాపూర్ హెచ్చరిస్తున్నారు. ఈ వాట్సాప్ గోల్డ్ మెసేజ్ ఒక పెద్ద స్కాం అని, ఆ మెసేజ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని ఆయన సూచిస్తున్నారు. మన దేశంలో 20 కోట్లకుపైగా వాట్సాప్ వినియోగదారులున్నారని, ఇప్పటికే ఈ ఫేక్ మెసేజ్ చాలామందికి చేరినట్లు తాము గుర్తించామని, దీని ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని, కాబట్టి అది వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు. నిజానికి... ఈ వాట్సాప్ గోల్డ్ మెసేజ్ 2016లోనే వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఇది సృష్టించిన రచ్చ అంతాఇంతా కాదు. వాట్సాప్ సంస్థ అధికారికంగా వెల్లడించిందేమోనని చాలామంది దాన్ని క్లిక్ చేసి... హ్యాకర్ల బారిన పడ్డారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు నానాతంటాలు పడ్డారు. దాన్ని ఎలాగోలా కనిపెట్టి, నివారణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది సర్క్యులేట్ అవుతుండడంతో... జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
9 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా