newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ + హాట్‌స్టార్‌ = సరికొత్త ఆఫర్‌ ఇదిగో

27-09-201927-09-2019 12:46:01 IST
Updated On 27-09-2019 16:05:53 ISTUpdated On 27-09-20192019-09-27T07:16:01.888Z27-09-2019 2019-09-27T07:15:59.591Z - 2019-09-27T10:35:53.835Z - 27-09-2019

బీఎస్‌ఎన్‌ఎల్‌ + హాట్‌స్టార్‌ = సరికొత్త ఆఫర్‌ ఇదిగో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆఫర్లు అంటే జియో, ఎయిర్‌టెల్‌ అనేలా తయారైంది పరిస్థితి. రీఛార్జ్‌ ఆఫర్లు, డేటా ఆఫర్లు, ఫ్రీ ఆఫర్లు అంటూ ఎప్పుడూ ఏదో ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. అందుకుతగ్గట్టే వినియోగదారులు కూడా వాటిని ఆదరిస్తున్నారు కూడా.  అందుకే బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా డేటా ఆఫర్ల మీద దృష్టి సారించింది. హాట్‌స్టార్‌తో కలసి డేటా ఆఫర్‌ని ప్రకటించింది. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్ స్టార్‌ 500. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఈ రెండింటిలో డేటాతోపాటు హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తారు. 

డేటా ప్లాన్లను డిఎస్‌ఎల్‌‌, భారత్‌ ఫైబర్‌ అనే రెండు కేటగిరీలుగా విభజించారు. డిఎస్‌ఎల్‌ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్స్‌  10ఎంబీపీఎస్‌ గరిష్ఠ వేగంతో 500 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. భారత్‌ ఫైబర్‌ సబ్‌స్క్రైబర్స్‌ 50 ఎంబీపీఎస్‌ గరిష్ఠ వేగంతో 500 జీబీ డేటాను పొందొచ్చు. ఈ డేటా అయిపోయిన తర్వాత  డేటా స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌ నెలవారీ ధర రూ.949. ఈ ప్లాన్‌ తీసుకుంటే రూ.1000 విలువైన హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయమూ లభిస్తుంది. 

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ గతంలో సూపర్‌ స్టార్‌ 300 పేరుతో ఓ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఈ ప్లాన్‌లో 300జీబీ డేటాను అందిస్తున్నారు. దీనికి హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ , ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. దీని నెలవారీ ధర రూ.749. ఈ ప్లాన్లు అండమాన్‌, నికోబార్‌లో తప్ప మిగిలిన అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది. 

ఒక విధంగా ఈ ప్లాన్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ జియోతో పోటీ పడుతోందనే చెప్పాలి. జియో రూ.849 ధరలో సిల్వర్‌ పేరుతో ప్లాన్‌ తీసుకొస్తోంది. అందులో 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 200 జీబీ డేటా అందిస్తున్నారు. దీంతోపాటు ఫ్రీ కాలింగ్‌, మూడు నెలల ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌, టీవీ వీడియో కాలింగ్‌ లాంటి ఫీచర్లూ అందిస్తున్నారు. 

Image result for bsnl and hotstar comes with new data offers

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle