newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపరాఫర్

02-08-202002-08-2020 19:01:13 IST
Updated On 02-08-2020 19:07:47 ISTUpdated On 02-08-20202020-08-02T13:31:13.644Z02-08-2020 2020-08-02T13:31:06.842Z - 2020-08-02T13:37:47.519Z - 02-08-2020

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపరాఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయ టెలికాం సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. 147తో మరో ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. అలాగే, రూ. 247, రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ల కాలపరిమితిని పెంచింది. అలాగే, ఎంపిక చేసిన ప్లాన్లతో ఎరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ. 78, రూ. 551, రూ. 249, రూ. 447 ప్రీపెయిడ్ ప్లాన్లను ఉపసంహరించుకుంది. అలాగే, రూ.144, రూ. 792, రూ. 1,584 పతంజలి ప్రీపెయిడ్ ప్లాన్లను  ప్రారంభించింది.

రూ. 147 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ 250 నిమిషాల ఎఫ్‌యూపీతో లభిస్తాయి. ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కూడా ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాలపరిమితి 30 రోజులు కాగా, 10 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ‘STV COMBO147’ అని టైప్ చేసి 123కి మెసేజ్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. 

అలాగే, రూ.247 ప్రీపెయిడ్ ప్లాన్‌ కాలపరిమితిని 36 రోజులకు, రూ.1,999 ప్లాన్‌ను రూ.439 రోజులకు పెంచింది. రూ. 247 ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లోక్‌ధున్, ఎరోస్ నౌక్ కంటెంట్ 30 రోజుల వరకు ఉచితంగా లభిస్తాయి. రూ. 429 ప్రీపెయిడ్ ప్లాన్‌లోనూ ఎరోస్ నౌ సర్వీసులు బండిల్డ్‌గా లభిస్తాయి.అలాగే వర్క్ ఫ్రం హోం ప్లాన్ 599 ద్వారా మూడునెలల పాటు ప్రతిరోజూ 5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. దీంతో పాటు ఆగస్టు నెలలో ఫుల్ టాక్ టైం ఆఫర్ కూడా అందిస్తోంది. 

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   16 hours ago


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   20 hours ago


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


4 యాప్స్ తీసిన  గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

4 యాప్స్ తీసిన గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

   18-11-2020


ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

   16-11-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle