బిగ్ స్క్రీన్‌పై లైవ్ వీడియోలు.. కరోనా రోగులకోసం కో వాచింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు
15-04-202015-04-2020 14:32:35 IST
Updated On 15-04-2020 14:36:53 ISTUpdated On 15-04-20202020-04-15T09:02:35.550Z15-04-2020 2020-04-15T09:02:32.895Z - 2020-04-15T09:06:53.618Z - 15-04-2020

ఇటీవలికాలంలో పర్సనల్ స్ట్రీమింగ్ కోసం అతి పెద్ద ప్లాట్ఫామ్లో ఒకటిగా ఇన్స్టాగ్రామ్ ఆవిర్భవించింది. గత కొద్దినెలలుగా ఇది కోట్లాదిమంది తన యూజర్ల కోసం పలు ఆకర్షణీయమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుండటం గమనార్హం. కరోనా వైరస్ నివారణకోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తన యూజర్ల వినోద అవసరాల కోసం, అలాగే ఒంటరితనంతో మగ్గిపోతున్న కరోనా రోగుల కోసం రెండు కొత్త ఫీచర్లను ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే, ఇన్స్టాగ్రామ్ కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త నవీకరణలను ప్రకటించడం తెలిసిందే. వైరస్ పై అవగాహన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రోత్సహించడానికి స్టిక్కర్లు, కోవిడ్ -19 తప్పుడు వార్తలను షేర్ చేసిన ఖాతాలను తొలగించడం, విరాళాలు, భౌతిక దూరాన్ని పాటించే వారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడేలా భాగస్వామ్య కథనాలను ఇవ్వడం, స్టేహోమ్ స్టిక్కర్‌ను ఉపయెగించుకుని, వీడియో చాట్ ద్వారా స్నేహితులతో చాటింగ్ అవకాశాలను ఇన్స్టాగ్రామ్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలతో ఇంటికి పరిమితమైన తన వినియోగదారులు వెబ్ బ్రౌజర్ ద్వారా బిగ్ స్కీన్ (డెస్క్ టాప్), పై వీడియోలను వీక్షించే అవకాశాన్ని కల్పించింది. లైవ్ వీడియోలు చూస్తుండగానే, కింద వున్న విండో ద్వారా వ్యాఖ్యలను స్క్రోల్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇప్పుడు పెద్ద స్క్రీన్ డివైస్ లలో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించ వచ్చని తెలిపింది. అయితే యూజర్లు ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులతో లైవ్ వీడియోలో వుండటం.. ఒకరి కన్నా ఎక్కుమందితో ఒకేసారి చాట్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. అలాగే, ల్యాప్‌టాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు కాబట్టి, ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించు కోవచ్చని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ సోకి ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్ల కోసమే ఒక ఫీచర్‌ను ఇటీవల ప్రకటించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగుల ఒంటరి భావనను పోగొట్టేందుకు కో వాచింగ్ పేరుతో కొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ఇంట్లో స్వీయ నిర్బంధంలో లేదా ఐసోలేషన్ వార్డులో వున్న యూజర్లు ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని పైన ఉన్న వీడియో గుర్తును క్లిక్ చేసి తమ స్నేహితుల పోస్టుల, స్టోరీలు లేదా ఇన్ స్టా లైవ్‌లను ఒకేసారి వీక్షించవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ వెబ్ బ్రౌజర్ నుండి డైరెక్టుగా సందేశాలను పంపుకునే అవకాశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా