newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బాబోయ్ ‘మాల్’వేర్..!

26-11-201826-11-2018 15:41:25 IST
Updated On 26-11-2018 15:27:12 ISTUpdated On 26-11-20182018-11-26T10:11:25.203Z26-11-2018 2018-11-26T09:57:12.254Z - 2018-11-26T09:57:12.257Z - 26-11-2018

బాబోయ్ ‘మాల్’వేర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లను ఉచితంగా నిక్షిప్తం చేసే అవకాశం ఉండడంతో... కనిపించిన ప్రతిదాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు వినియోగదారులు! కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు... దాని పర్యవసానాలేంటో తెలుసుకోవడం కోసమని వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఇదే పరిణామం ప్రమాదాలకు దారితీస్తుంది. యాప్‌ల మాటున మాలీషియస్, మాల్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రేరేపించి... ఫోన్‌లో ఉండే మొత్తం సమాచారాన్ని దొంగలిస్తున్నారు. పర్సనల్ డేటాని చోరీ చేయడమే కాదు... బ్యాంకింగ్ వ్యవహారాల వివరాలన్నీ తెలుసుకుని, మొత్తం డబ్బుల్ని దండేసుకుంటున్నారు.

పొరపాటున ఆ మాల్‌వేర్లను ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు... ఆ ఫోన్ ఇక అదుపు తప్పినట్లే! చేతిలో ఫోన్ ఉన్నా... దాన్ని కంట్రోల్ చేసేది మాత్రం సైబర్ నేరగాళ్ళే! ఫోన్‌లో నిక్షిప్తం చేసి ఉన్న సమస్త సమాచారం వారి చేతికి చిక్కుతుంది. బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌, ఓటీపీ వంటి రహస్య సంకేతాలన్నీ వారికి చేజిక్కుతాయి. కొన్నిసార్లు ఆన్‌లైన్‌ లావాదేవీల సమయాల్లో... అసలు వినియోగదారుడి ఫోన్‌కు ఓటిపి రాకుండా చేసి, ఖాతా నుంచి డబ్బు మళ్ళించుకునే ఛాన్స్ కూడా ఉంది. అలాగే... కాసేపు ఫోన్ పనిచేయకుండా చేయగలరు. ఇక వ్యక్తిగత వీడియోలు ఏమైనా ఉంటే... వాటిని అడ్డం పెట్టుకుని భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ఆస్కారం ఉంది. మరి... ఈ సైబర్ నేరగాళ్ళ అదుపులోకి మన ఫోన్‌లు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

- సైబర్ నేరగాళ్ళు యాప్‌ల మాటున పంపించే మాల్‌వేర్స్ ‘ప్లే స్టోర్’లో ఉండవు. వాళ్ళు మెసేజ్ ద్వారా లింక్స్ పంపుతారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.
-  ఫోన్‌లో సురక్షితమైన మాల్‌వేర్‌ ప్రొటెక్షన్‌ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేసుకుంటే మంచిది. అది మాల్‌వేర్‌ని గుర్తించి, దాన్ని నిక్షిప్తం చేసుకోవద్దని ముందే వార్నింగ్ ఇస్తుంది.
- ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల సమయంలో ‘వర్చువల్‌ కీ బోర్డు’నే వినియోగించాలి. ఈ కీబోర్డుపై సంఖ్యలు, అక్షరాలు వినియోగించే ప్రతిసారి మారుతాయి కాబట్టి... సైబర్ నేరగాళ్ళు మనం ఏ అక్షరాల్ని, అంకెల్ని నమోదు చేస్తున్నామో గుర్తించలేరు.
- ఒక యాప్‌ను అవసరార్ధం ఇన్‌స్టాల్ చేసుకుంటే... పని అయిపోయాక దాన్ని వెంటనే డిలీట్ చేయడం మంచిది.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle