ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ ఆఫర్లివే
13-09-201913-09-2019 12:22:19 IST
2019-09-13T06:52:19.722Z13-09-2019 2019-09-13T06:46:37.917Z - - 14-04-2021

వినియోగదారులకు భారీ ఆఫర్లు అందించే ‘బిగ్ బిలియన్ డేస్’ను ఫ్లిప్‌కార్ట్ మరోసారి నిర్వహించబోతోంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు అంటే ఆరు రోజుల పాటు ఈ మెగా సేల్ ఉండబోతోంది. ఇందులో చాలా రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్ ఇస్తున్నారు. 29 నుంచి నాలుగో తేదీవరకు ఫ్యాషన్, టీవీ మరియు అప్లియెన్సెస్, బ్యూటీ, టాయ్స్, స్మార్ట్ డివైజెస్, గ్రాసరీ విభాగంలో ఈ సేల్ ఉంటుంది. మొబైల్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, యాక్ససెరీస్ సేల్ సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులు అయితే ‘బిగ్ బిలియన్ డేస్’ ఆఫర్లను సాధారణ సమయం కంటే నాలుగు గంటల ముందే పొందొచ్చు. కార్డు డిస్కౌంట్లు ఇవీ... ఫ్లిప్‌కార్ట్ ఈసారి రెండు బ్యాంకులతో టైఅప్ అయ్యింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపైనా 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు వివిధ రకాల క్రెడిట్ ఆప్షన్లనూ అందుబాటులోకి తెస్తోంది. కార్డ్‌లెస్ క్రెడిట్, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ లాంటి ఆప్షన్లతో పాటు ప్రముఖ క్రెడిట్, డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది. ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారు వాటితో పాటు ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని తొలిసారి ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. బహుమతులూ ఉన్నాయ్! సేల్ సమయంలో ఆటలు, కాంటెస్టులు నిర్వహించి సుమారు ₹ 100 కోట్ల బహుమతులు అందించనుంది. దీంతోపాటు కొన్ని రకాల వస్తువుల కొనుగోలుపై నాలుగు రెట్ల సూపర్ కాయిన్లను కూడా అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో తొలిసారిగా చేతి వృత్తిదారులు, చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముకునే సదుపాయాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తోంది. రోజుకు నాలుగుసార్లు క్రేజీ డీల్స్ పేరుతో రోజూ అర్ధరాత్రి 12, ఉదయం 8, మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు ప్రత్యేక డీల్స్ ఉంటాయి. వీటిలో భాగంగా మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్స్‌పై కొత్త డీల్స్ అందిస్తారు. మహా డ్రాప్ ఆప్షన్లో భాగంగా దుస్తులు, అలంకరణ సామగ్రిపై అదనంగా 20 శాతం డిస్కౌంట్ ఇస్తారు. రష్ అవర్స్ పేరున రాత్రి 12 నుంచి 2 మధ్య కొనుగోలు చేస్తే ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా