newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ్లిప్‌కార్ట్‌.. అమెజాన్‌ మరోసారి సేల్స్‌ తీసుకొస్తున్నాయ్‌!

08-10-201908-10-2019 10:03:52 IST
2019-10-08T04:33:52.926Z08-10-2019 2019-10-08T04:33:49.505Z - - 12-04-2021

ఫ్లిప్‌కార్ట్‌.. అమెజాన్‌ మరోసారి సేల్స్‌ తీసుకొస్తున్నాయ్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెజాన్‌ వారి ‘గ్రేట్‌ ఇండియా సేల్’‌, ఫ్లిప్‌కార్ట్‌ వారి ‘బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌’అయిపోయింది. ఆఫర్లు వాడుకోలేకపోయానే అని బాధపడుతున్నారా?  మీ లాంటి వారికి ఆ రెండు సంస్థలు  మరోసారి ఆఫర్ల పండగను తీసుకొస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఆ సంస్థలు మరోసారి సేల్‌ని నిర్వహించబోతున్నాయి.  ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’పేరుతో అమెజాన్‌... ‘బిగ్‌ దివాళీ సేల్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ముందుకొస్తున్నాయి.  ఎప్పట్నుంచి ఈ సేల్స్‌ జరుగుతాయి. ఏయే ఆఫర్లు ఉంటాయో చూడండి. 

13 నుంచి అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్‌, కెమెరాలు, టీవీ, ఇతర గ్యాడ్జెట్లపై అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ సేల్‌ ఉంటుంది. ప్రైమ్‌ వినియోగదారులకు అక్టోబర్‌ 12 మధ్యాహ్నం  నుంచే ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ ఉంటుంది.స్మార్ట్‌ఫోన్లపై  స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నారు. 

ఆపిల్‌, షావోమి, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, వివో, హానర్‌ బ్రాండ్ల ఫోన్లపై ఆఫర్లున్నాయి. వన్‌ప్లస్‌ 7T ప్రో ఫోన్‌ను ఈ సేల్‌లోనే  తొలిసారిగా సేల్‌కు తీసుకొస్తున్నారు. బైల్‌ ఫోన్లే కాకుండా టీవీలు, ఇతర గ్యాడ్జెట్లపైనా ఈ సేల్‌లో ఆఫర్లు ఉంటాయి. ఏ ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్‌ అనే వివరాలు త్వరలో వెల్లడిస్తారు. 

12 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ ‘బిగ్‌బిలియన్‌ డేస్‌’ తరహాలోనే ప్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ దివాళీ సేల్‌’ తెస్తోంది. ఈ నెల 12 నుంచి 16 వరకు దివాళీ సేల్‌ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యులు  11 రాత్రి 8 గంటల నుంనే ఆఫర్లు వాడుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు యూజర్లు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందొచ్చు. నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, డిస్కౌంట్‌తో కూడిన మొబైల్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్లు, బైబ్యాక్‌ గ్యారెంటీ ప్లాన్లు ఎలాగూ ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 7 ప్రో, రెడ్‌మీ 7s,రియల్‌మీ 5, వివో Z1 ప్రో, రియల్‌మీ c2 మొబైల్స్‌ ఈసేల్‌లో ఉండబోతున్నాయి. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచీలనూ ఈ సేల్‌లో తీసుకొస్తున్నారు. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle