newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ఫ్రెంచ్ రచయిత మోలియర్‌పై గూగుల్ డూడుల్

10-02-201910-02-2019 08:29:17 IST
Updated On 10-02-2019 08:36:33 ISTUpdated On 10-02-20192019-02-10T02:59:17.376Z10-02-2019 2019-02-10T02:53:02.728Z - 2019-02-10T03:06:33.864Z - 10-02-2019

ఫ్రెంచ్ రచయిత మోలియర్‌పై  గూగుల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పేజీ ఓపెన్ చేయగానే ఒక డూడుల్ మనకు కనిపిస్తుంది. ఆరోజు ప్రత్యేకతలను గుర్తుచేస్తూ డూడుల్  రూపొందించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 10వ తేదీ సందర్భంగా గూగుల్ ఓ యానిమేటెడ్ డూడుల్‌ను హోం పేజీలో ఉంచింది. 

ప్రముఖ ఫ్రెంచి రచయిత, ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ ని గుర్తుచేస్తూ గూగుల్ డూడుల్ తయారుచేసింది. మోలియర్ అసలు పేరు Jean Baptiste ‘Poquelin’అయితే Molie RE పేరుతో  నాటకాలు రాశాడు. ప్రేమ ,సంఘం ,మతం ,అధికారం మొదలైన సమస్త విషయాలపై వ్యంగ్యంగా విరుచుకు పడ్డాడు. 1622లో మోలియర్ ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో జన్మించాడు. 1641లో 19ఏళ్ళకే లా పట్టభద్రుడయ్యాడు. మోలియర్ 10 ఫిబ్రవరి 1673లో తన చివరి నాటకాన్ని ప్రదర్శించారు. హాస్యంలో మోలియర్ నాటకాలకు ప్రత్యేక స్థానం ఉంది.  మోలియర్ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఫర్నిచర్ బిజినెస్ వున్నా.. దాని వైపు చూడకుండా చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి కనబరిచాడు.

Related image

సెటైర్లు వేయడంలో, మంచి కామెడీని పండించడంలో మోలియర్ ప్రశంసలు పొందాడు. సామాజిక సమస్యలను టచ్ చేసే రచనలు చేశాడు. మోలియర్ రాసిన Tartuffe రచనను అప్పటి రాజు లూయీ 14 నిషేధించారు.ఈ రచన మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఐదేళ్ళపాటు నిషేధం విధించారు.1673 ఫిబ్రవరి 17న 53ఏళ్ళకే మోలియర్ మరణించాడు. ఈ డూడుల్ గూగుల్‌లో  వైరల్‌గా మారింది. 

మన భమిడిపాటి (భ.కా.రా)కి మోలియరే స్ఫూర్తి 

భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని తెలుగీకరించి ఆంధ్ర దేశం మీద వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు నేపథ్యంలో అందంగా గొప్పగా మాటల గారడీ‌‌తో తయారు చేశారు. నౌకర్లు అయిన చవలాయ్ లాంటి వారికి ప్రాణ ప్రతిష్ట చేశారు .లోభిత్వం, రెండో పెళ్లి‌పై మోజున్న వారిపై మాటల బాణాలు వదిలారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle