newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫోల్డ‌బుల్ ఫోన్లు కొన‌వ‌చ్చా..?

04-05-201904-05-2019 08:35:49 IST
2019-05-04T03:05:49.868Z04-05-2019 2019-05-04T03:05:47.015Z - - 10-04-2021

ఫోల్డ‌బుల్ ఫోన్లు కొన‌వ‌చ్చా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 
ఎప్ప‌టిక‌ప్పుడు సాంకేతిక‌త‌లో వినూత్న మార్పులు తీసుకువ‌స్తూ అంద‌రినీ ఆక‌ర్షించేలా త‌మ ఉత్ప‌త్తుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి మొబైల్ త‌యారీ కంపెనీలు. ఇందుకే ఇప్పుడు ప్ర‌ముఖ మొబైల్ కంపెనీల‌న్నీ ఫోల్డ‌బుల్ ఫోన్స్ మాట ప‌దేప‌దే వినిపిస్తున్నాయి. సాంసంగ్ ఇప్ప‌టికే ఫోల్డ‌బుల్ ఫోన్ మార్కెట్ లోకి తీసుకువ‌చ్చింది. త్వ‌ర‌లో భార‌త్‌లోనూ అమ్మ‌కాలు ప్రారంభించ‌నుంది ఆ సంస్థ‌.
 
ఇక‌, హువావే, షియామీ, మోటొరోలా కంపెనీలు కూడా త్వ‌ర‌లోనే ఫోల్డ‌బుల్ ఫోన్లు విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే అవి డెమో ఫోన్ల‌ను ప్ర‌ద‌ర్శించాయి. దీంతో 2019లో చాలా కంపెనీలే ఫోల్డ‌బుల్ ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువ‌స్తున్నాయి. సుమారు రూ.ల‌క్ష‌కు పైగా ఈ ఫోన్ల ధ‌ర‌లు ఉండే అవ‌కాశం ఉంటుంది. ఇంత ధ‌ర పెడుతున్న‌ప్పుడు ఈ ఫోన్ల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే కొనుగోలు చేయ‌డం ఉత్త‌మం.
 
సాధార‌ణంగా మ‌నం వాడే ట్యాబ్లెట్ల‌ను ఫోల్డ‌బుల్ ఫోన్లు భ‌ర్తీ చేస్తాయ‌ని చెప్ప‌వచ్చు. ఈ ఫోన్లు ఓపెన్ చేస్తే ట్యాబ్లెట్ల సైజులో, ఫోల్డ్ చేస్తే మామూలు మొబైల్ ఫోన్ సైజులో ఉంటాయి. కాబ‌ట్టి మ‌నం ఫోల్డ్ చేసుకొని జేబులో పెట్టేసుకోవ‌చ్చు. దీంతో ఈ ఫోన్ల‌పై ఆంద‌రిలో ఆస‌క్తి ఉంది. అయితే, ఫోల్డ‌బుల్ ఫోన్లతో ఎన్ని లాభాలు ఉన్నాయో స‌మ‌స్య‌లు కూడా అలానే ఉండే అవ‌కాశం ఉంది.
 
ప్ర‌స్తుతం సాధార‌ణ ఫోన్లు అన్ని గ్లాస్ డిస్ల్పేతో వ‌స్తాయి. గోరిల్లా గ్లాస్ పై ప్కాచెస్  కూడా ఎక్కువ‌గా ప‌డ‌వు. ఫోల్డ‌బుల్ ఫోన్ల‌కు మాత్రం ఈ గ్లాస్ డిస్ల్పే వాడ‌లేరు. కాబ‌ట్టి పాలిమ‌ర్ ప్రొటెక్ష‌న్ లేయ‌ర్ తో నూత‌న డిస్ల్పేను కంపెనీలు త‌యారుచేస్తున్నాయి. వీటిపై స్క్రాట్చెస్ ఎక్కువ‌గా ప‌డే అవ‌కాశం ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ ఫోన్ల‌లో ఉండే అవ‌కాశం ఉండ‌ద‌దు. డిస్ల్పే స‌మ‌స్య కూడా ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక‌, ప‌లు యాప్ లు కూడా ఫోల్డ‌బుల్ ఫోన్ల‌కు త‌గ్గ సైజులో ఉండ‌వు. కాబ‌ట్టి యాప్స్ కూడా పెద్ద స్క్రీన్‌కు త‌గ్గ సైజులో క‌స్ట‌మైజ్ చేయాల్సి ఉంటుంది.
 
మొత్తంగా ఫోల్డ‌బుల్ ఫోన్ల డిస్ల్పే పెద్ద‌గా ఉండ‌టం, మ‌డ‌త పెట్టుకొని జేబులో పెట్టుకోగ‌ల‌గ‌డం వంటి ప‌లు సౌల‌భ్యాలు ఉన్నా కొన్ని సాఫ్ట్ వేర్‌, హార్డ్ వేర్ స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగ‌ని కచ్చితంగా ఈ స‌మ‌స్య‌లు అన్ని ఫోన్ల‌లో వ‌స్తాయ‌ని చెప్ప‌లేం. ఎందుకంటే ఈ కంపెనీలు చాలా ఏళ్లుగా ఈ ఫోన్ల త‌యారీపై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. కానీ, ఎందుకైనా ఈ ఫోన్లు తీసుకునేట‌ప్పుడు ఇటువంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయేమో పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేస్తే మంచిది.
ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle