ఫేస్ బుక్ ‘లిబ్రా’ నుంచి బయటికొచ్చిన పేపాల్
06-10-201906-10-2019 12:29:35 IST
2019-10-06T06:59:35.994Z06-10-2019 2019-10-06T06:59:10.447Z - - 10-04-2021

ఫేస్ బుక్ నుంచి క్రిప్టో కరెన్సీ త్వరలో రానుంది. ఈ మేరకు ఇటీవల ఫేస్ బుక్ అధికారిక ప్రకటన కూడా చేసింది కూడా. ఈ తయారీ బృందంలో కీలకంగా ఉన్న పేపాల్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. లిబ్రా తయారీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో లిబ్రాపై కొన్ని నియంత్రణ సంస్థలు అభ్యంతరాలను వ్యక్తంచేయడంతో పేపాల్ బయటకు వచ్చేసిందని తెలుస్తోంది. ‘‘లిబ్రా క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలకు దూరమవ్వాలని పేపాల్ నిర్ణయించుకొంది. అయితే లిబ్రా ఆశయాలకు మద్దతు ఇస్తాం. భవిష్యత్తులో కలసి పనిచేసే అంశంపైనా చర్చిస్తాం’’ అని పేపాల్ పేర్కొంది. లిబ్రా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్లు ఫేస్ బుక్ కొన్ని నెలల క్రితం తెలిపింది. లిబ్రా అనే సంస్థతో 28 మంది వ్యాపార భాగస్వాములను అనుసంధానించి ఫేస్ బుక్ దీన్ని రూపొందిస్తోంది. 2020 నాటికి డిజిటల్ కాయిన్ను చలామణిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఫేస్బుక్ కలిబ్రా అనే డిజిటల్ వ్యాలెట్ సేవల కోసం మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. కలిబ్రా వ్యాలెట్ ను ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ యాప్ కు అనుసంధానిస్తారు. చైనాలోని వి చాట్ తరహాలో మెసేజింగ్ యాప్స్ నుంచి ఆదాయం పొందేలా ఫేస్బుక్ వీటిని తీసుకొచ్చింది. సరైన విధానం లేని క్రిప్టో కరెన్సీ రంగంలోకి ఫేస్బుక్ రావడంతో ప్రభుత్వ రంగ రెగ్యులేటరీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పేపాల్ బయటకు రావడంతో లిబ్రా ప్రాజెక్టులో మాస్టర్ కార్డ్, వీసా, స్పాటి ఫై, పేపాల్, ఈబే, ఉబర్ టెక్నాలజీ, వొడాఫోన్ గ్రూప్ లాంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. లిబ్రా బయటకు వచ్చే నాటికి 100 మందినైనా భాగస్వాములుగా చేసుకోవాలని ఫేస్ బుక్ చూస్తోంది. కలిబ్రా వ్యాలెట్ వినియోగించాలంటే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తారు. కీలక ఖాతాలకు సంబంధించిన సమాచారం మాత్రమే కలిబ్రా భాగస్వాములకు కానీ, ఫేస్బుక్కు కానీ వెళుతుంది. చట్ట నిబంధనల ప్రకారం భద్రత కోసమే ఇలా చేస్తారు.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా