newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫేస్ బుక్‌లో అదిరిపోయే ఫీచర్

25-04-202025-04-2020 12:40:30 IST
Updated On 25-04-2020 13:52:22 ISTUpdated On 25-04-20202020-04-25T07:10:30.340Z25-04-2020 2020-04-25T07:10:01.570Z - 2020-04-25T08:22:22.990Z - 25-04-2020

ఫేస్ బుక్‌లో అదిరిపోయే ఫీచర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ వేళ టెక్నాలజీ పెరిగిపోయింది. అంతా ఇంట్లోనే వుండడంతో డేటా వినియోగం ఎక్కువయింది. సోషల్ మీడియా యాప్స్ కూడా బాగా వాడుతున్నారు. ఫేస్‌బుక్‌ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్‌ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్‌ కిడ్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ఈ వారాంతంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 

తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్‌ యాప్‌ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్‌ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం పెరుగుతోంది. దీంతో పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ అయ్యేందుకు మెసెంజర్‌ కిడ్స్‌ ఉపయోగపడుతుందని వివరించింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో వివిధ విద్యాసంబంధమయిన సందేహాలు తీర్చుకోవచ్చు. కంబైన్డ్ స్టడీ తరహాలో మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ తెలిపింది. 

ఇప్పటికే ఫేస్ బుక్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. భారీగా పెట్టుబడి పెట్టనున్న సంగతి తెలిసిందే.  ప్రజలకు మరింత చేరువ కావడానికి జియో మార్ట్ లు రానున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్‌ రిటైల్, వాట్సాప్‌ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. రిలయన్స్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ విభాగం జియోమార్ట్‌ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్‌ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్‌ఐఎల్‌ వివరించింది. ఈ–కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు త్వరలో రానున్నాయి. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle