ఫేస్‌బుక్‌ని షేక్ చేస్తున్న ఫేక్ న్యూస్
06-04-201906-04-2019 09:26:39 IST
Updated On 06-04-2019 09:40:22 ISTUpdated On 06-04-20192019-04-06T03:56:39.401Z06-04-2019 2019-04-06T03:56:33.415Z - 2019-04-06T04:10:22.906Z - 06-04-2019

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్కి ఈమధ్య తలనొప్పులు తప్పడంలేదు. ఇంటర్నెట్లో ఫేక్ న్యూస్ విపరీతంగా ప్రచారం అవుతుండడంతో వివిధ దేశాలు ఆగ్రహంగా వున్నాయి. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో అది మరింత తలనొప్పి వ్యవహారంగా తయారైంది. అందుకే నిజమైన వార్తలను గుర్తించడం ముఖ్యమైన పనిగా మారింది. ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు ఫేక్ న్యూస్‌ను గుర్తించడానికి థర్డ్ పార్టీపై ఆధారపడుతున్నాయి. కానీ ఇది సమస్యకు సరైన పరిష్కారం చూపించడంలేదని తెలుస్తోంది. ఇండియాలో ఎన్నికల నేపథ్యంలో ఈ ఫేక్ న్యూస్ మరీ ఎక్కువయ్యాయి. చాలామంది వాస్తవ విషయాలకు ఫొటోషాప్‌లో మార్పులు చేసి సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు. అసలు వార్తలను వక్రీకరించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా అది నష్టాన్ని కలిగించేందుకు కారణమవుతుంది. కొన్ని చోట్ల సామాజిక భద్రత ప్రశ్నార్థకం అవుతోంది. నిజమైన వార్తలేవో థర్డ్ పార్టీ సంస్థలు తేల్చి చెబుతున్న తర్వాత కూడా అందులో కొన్ని తప్పుడు వార్తలేనని తేలుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత నిజ నిర్ధారణ చేస్తున్న వారి రిపోర్ట్‌పై కూడా ఇంకోసారి నిజనిర్ధారణ జరగాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2016లో అమెరికా ఎన్నికలు జరిగినప్పుడు ఫేస్బుక్ థర్డ్ పార్టీ చెకింగ్‌ను ఆశ్రయించింది. ఇప్పుడు భారత ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అదే విధానాన్ని ఫాలో అవుతుంది. భారత్‌లో ఫేస్బుక్ ఫేక్ న్యూస్‌ను గుర్తించేందుకు ఇండియా టుడే గ్రూప్ వార్త సంస్థను పార్ట్నర్గా చేసుకుంది. ఇండియాలో ఫేక్ న్యూస్‌ను గుర్తించేందుకు ఫేస్బుక్ తేలిక మార్గాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ నిజనిర్ధారణ నెట్‌వర్క్‌కు అనుసంధానంగా ఉన్న వాటినే ఎంచుకుంటుంది. మొత్తం మీద ఫేక్ న్యూస్ ఫేస్ బుక్‌ని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా