newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫేస్‌బుక్ హ్యాక్... 3 కోట్ల యూజర్ల డాటా చోరీ

13-10-201813-10-2018 14:03:58 IST
Updated On 13-10-2018 14:03:58 ISTUpdated On 13-10-20182018-10-13T08:33:58.263Z13-10-2018 2018-10-13T08:33:58.263Z - 2018-10-13T08:33:58.265Z - 13-10-2018

ఫేస్‌బుక్ హ్యాక్... 3 కోట్ల యూజర్ల డాటా చోరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘ఫేస్‌బుక్’... ఒకప్పుడు డేటాను భద్రంగా ఉంచే సామాజిక మాధ్యమంగా పేరుండేది. హ్యాక్ చేయడానికి వీలులేని అత్యంత పటిష్టమైన సోషల్ ప్లాట్‌ఫార్మ్‌గా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పుడు... హ్యాకర్ల బారిన పడి వివాదాల్లో చిక్కుకుంటోంది. తమకు తిరుగులేదనే ధీమాతో ఈ సంస్థ తేలిగ్గా తీసుకుందో ఏమో... హ్యాకర్లు ఫేస్‌బుక్‌పై పగబట్టినట్లుగా హ్యాక్ చేసి, యూజర్ల సమాచారాన్ని దొంగలిస్తున్నారు. కేంబ్రిడ్జ్ అనలటికా వ్యవహారంతో ఇంకా తేరుకోకముందే... గత నెలలోనే 5 కోట్ల మంది యూజర్ల డేటా చోరీ కావడం సంచలనంగా మారింది. ఆ సమయంలో ఏం చెప్పాలో తెలీక అయోమయంలో పడిపోయిన ఫేస్‌బుక్... సుధీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఆ వ్యవహారంపై స్పందించింది. ముందుగా చెప్పినట్లు 5 కోట్ల ఖాతాలు చోరీ కాలేదని... దాదాపు 3 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాక్ చేశారని ఆ సంస్థ స్పష్టతనిచ్చింది. 2017 జులై నుంచి 2018 సెప్టెంబరు వరకు ఉన్న ఫేస్‌బుక్‌ కోడ్‌లో ఒక లోపం ఉండడంతో... హ్యాకర్లు దాన్ని అవకాశంగా తీసుకుని ఈ చోరీకి పాల్పడ్డారని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గై రోసెన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ లోపాన్ని సరిచేశామన్న ఆయన... కేవలం 4 లక్షల మంది యూజర్ల ఖాతాల ద్వారా హ్యాకర్లు 3 కోట్ల మంది యూజర్ల డేటాను చోరీ చేయగలిగారని తెలిపారు.

‘‘హ్యాకర్లు తొలుత 4లక్షల మంది యూజర్ల ఫ్రెండ్స్‌ లిస్ట్‌ను తీసుకున్నారు. ఆ జాబితాతో 3 కోట్ల మంది యూజర్ల యాక్సెస్‌ టోకెన్స్‌ను వాళ్ళు దొంగలించారు. ఇందులో 1.5 కోట్ల మంది యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీని మాత్రమే తెలుసుకున్నారు. మిగతా 1.4 కోట్ల మంది యూజర్లపై హ్యాకర్ల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. యూజర్ల పేరు, నెంబర్, ఈ-మెయిల్‌తో పాటు లింగం, ప్రాంతం, భాష, రిలేషన్‌షిప్‌ స్టేటస్‌, మతం, పుట్టినతేదీ, ఎక్కడ నివసిస్తారు, ఏ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ వాడుతున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వారి రెగ్యులర్ దినచర్యలేంటి, ఫేస్‌బుక్‌లో ఏం సెర్చ్ చేశారు... వంటి వ్యక్తిగత విషయాల్ని హ్యాకర్లు తెలుసుకున్నారు’’ అని రోసెన్ వెల్లడించారు. ఇక యాక్సెస్‌ టోకెన్లు చోరీకి గురైన మిగతా 10 లక్షల యూజర్ల నుంచి హ్యాకర్లు ఎలాంటి డేటాను సేకరించలేదని ఆయన వెల్లడించారు. హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే ఆయా యూజర్లకు తెలియజేస్తామని, వారి ఖాతాల్ని తాము సరిచేశామని, తిరిగి వాళ్ళు పాస్‌వర్డ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని రోసెన్ పేర్కొన్నారు. కాగా... గత నెలలో ఫేస్‌బుక్ హ్యాక్‌కి గురైనట్లు వార్తలు రాగానే, అమెరికా మార్కెట్లో ఫేస్‌బుక్‌ షేర్లు 2.6 శాతం క్షీణించాయి. ఇప్పుడు తాజాగా వెల్లడించిన వివరాల అనంతరం ఆ సంస్థ షేర్లు మరో 0.5 శాతం పడిపోయాయి. రానున్న రోజుల్లో ఈ పతనం మరింత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా...!

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle