newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఫేస్‌బుక్, గూగుల్ బాటలోనే ట్విట్టర్.. కీలక నిర్ణయం

13-05-202013-05-2020 13:55:47 IST
Updated On 13-05-2020 16:02:16 ISTUpdated On 13-05-20202020-05-13T08:25:47.434Z13-05-2020 2020-05-13T08:25:29.033Z - 2020-05-13T10:32:16.956Z - 13-05-2020

ఫేస్‌బుక్, గూగుల్ బాటలోనే ట్విట్టర్.. కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే కరోనా అందరినీ భయపెడుతోంది. పెద్ద పెద్ద సంస్థలు సైతం ఉద్యోగుల్ని తగ్గించేస్తున్నాయి. ఖర్చుల్ని అదుపుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తాజాగా చేసిన ప్రకటనపై ఉద్యోగులు సానుకూలంగా స్పందిస్తున్నారు. 

ఇకపై తమ కంపెనీ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఇంటి దగ్గర నుంచే పని చేయవచ్చునని ప్రకటించింది. ఇప్పటికే ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించిన సంగతి తెలిసిందు. ఒకవేళ కరోనా వ్యాప్తి కంట్రోల్ అయినా కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే వర్క్ చేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని ట్విట్టర్ తెలిపింది.

ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలో ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు.. మరిన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించాలని కోరడంతో.. దాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ తెలిపింది.సెప్టెంబర్ వరకు తమ కార్యాలయాలను తెరిచేది లేదని ట్విట్టర్ స్పష్టం చేసింది. తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని, ఉద్యోగుల భద్రత కోసం వర్క్ ఫ్రం హోం సౌకర్యం వినియోగించుకోవచ్చని, వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే ట్విట్టర్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

డెస్క్​టాప్​లో ‘ట్విట్టర్ ఫర్ డెస్క్’ వాడే ఎంపిక చేసిన యూజర్లు తమ సందేశాలను ముందుగా రెడీచేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటే మనం అనుకున్న టైంకి ఆ మెసేజ్ అవతలివారికి చేరేలా ఈ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. దీని ద్వారా ముందుగానే ట్వీట్​ రెడీ చేసుకొని.. అనుకున్న స‌మ‌యానికి సెండ్​ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ట్వీట్​ వెళ్లే ముందు.. ఒకసారి సరిచేసేందుకు కూడా ఎడిటింగ్ అవకాశం కల్పించనుంది.

వీటిలో అసభ్యకర పదాలు గుర్తించేందుకు ఏఐ, ఎంఎల్​ టూల్స్​ను తయారు చేసింది ట్విట్టర్. ఈ ఎడిట్​ ఆప్షన్​ ప్రస్తుతం ఐఓఎస్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నామ‌ని.. సోషల్​ మీడియా మెనేజర్లు, మీడియా ప్రతినిధులకు ఈ ఫీచ‌ర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఉదాహరణకు రెండురోజుల తర్వాత ఏదైనా దినోత్సవం/పుట్టినరోజు/పెళ్లిరోజు వుంటే ముందుగానే సందేశం రెడీ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకునే అవకాశం వుంటుంది. 

 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle