ఫేస్బుక్ టు గూగుల్... ఫొటోస్ ట్రాన్స్ఫర్ అవుతాయ్!
03-12-201903-12-2019 17:06:21 IST
2019-12-03T11:36:21.989Z03-12-2019 2019-12-03T11:36:19.031Z - - 20-04-2021

ఫేస్బుక్లో ఓ మంచి ఫొటోనో, వీడియోనో చూశారు.. దానిని మీ గూగుల్ ఫొటోస్ పంపిద్దామనుకున్నారు... అప్పుడేం చేయాలి. ముందుగా ఆ ఫొటోను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్లో గూగుల్ ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేయాలి. దీని వల్ల సమయం వృథా. రెండేసి యాప్‌లు ఓపెన్ చేయాలి. త్వరలో దీని కోసం ఇంత ఝంఝాటం అవసరం లేదు. అవును దీని కోసం ఫేస్బుక్ కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదే ఫేస్బుక్ టు గూగుల్ ఫొటోస్ షేర్. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ఐర్లాండ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని యాక్సెస్‌కు తీసుకొస్తారని తెలుస్తోంది.
ఫేస్బుక్ టు గూగుల్ ఫొటోస్ ప్రక్రియ ట్రాన్స్ఫర్ రూపంలో జరుగుతుంది. అంటే మీ ఫేస్బుక్లో ఫొటోస్ ఫోల్డర్‌ను నేరుగా ఒకేసారి గూగుల్ ఫొటోస్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రతిసారి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీకు పాస్వర్డ్ టైప్ చేసి అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి ఆప్షన్‌ను తీసుకొస్తున్నట్లు సెప్టెంబరులోనే ప్రకటించింది. డేటా పోర్టబిలిటీ రోసం కొత్త టూల్స్ సిద్ధం చేస్తున్నామని చెప్పింది. అందులో భాగంగానే ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి గూగుల్ ఫొటోస్‌కు మాత్రమే పని చేస్తున్న ఈ ఆప్షన్ త్వరలో మరికొన్ని సర్వీసులకు వర్తింపజేయబోతున్నారు.
వంద మిలియన్లకుపైగా యాక్టివ్ యూజర్లు ఉన్న సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో డేటా ట్రాన్స్ఫర్ సౌకర్యం ఉండాలని యూఎస్ సెనేట్ బిల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూఎస్ సెనేటర్ జాష్ హాలీ, మార్క్ వార్నర్, రిచర్డ్ బ్లుమెంథల్ ఇటీవల బిల్ తీసుకొచ్చారు. దీని కోసం ఫేస్బుక్ చర్యలు ప్రారంభించిందని వార్తలొచ్చాయి. అందులో భాగంగానే ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారని తెలుస్తోంది. మరి ఫేస్బుక్ ఈ డేటా ట్రాన్స్ఫర్ను ఇంకెన్ని యాప్స్ అందుబాటులోకి తెస్తుందో చూడాలి. అలాగే ఇది ఎంతవరకు సురక్షితంగా జరుగుతుందో చూడాలి.



వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా