newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ఫేస్‌బుక్‌-ఒక ఐడియా.. జీవితాల్ని మార్చేసిందా?

04-02-201904-02-2019 17:59:27 IST
Updated On 04-02-2019 17:59:25 ISTUpdated On 04-02-20192019-02-04T12:29:27.992Z04-02-2019 2019-02-04T12:04:56.121Z - 2019-02-04T12:29:25.716Z - 04-02-2019

ఫేస్‌బుక్‌-ఒక ఐడియా.. జీవితాల్ని మార్చేసిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌ ప్రయాణం ప్రారంభించి ఇవాళ్టికి 15 వసంతాలు పూర్తయింది.  ఫిబ్రవరి 4, 2004లో ప్రస్థానం ప్రారంభించిన ఫేస్‌బుక్ అంచెలంచెలుగా ఎదిగింది. ఈ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు, మరెన్నో విమర్శలు, ఎన్నెన్నో వత్తిళ్ళు. సోషల్ మీడియాను ఏలుతున్న నెట్ వర్క్‌ ఫేస్ బుక్. అసలు ప్రపంచంలోని ఫేస్‌బుక్ యూజర్లందరినీ కూడిక వేస్తే.. ఓ దేశం అవుతుంది. ఫేస్ బుక్‌కి డిసెంబర్ 2018 చివరినాటికి మొత్తం 220 కోట్లమంది వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీరిలో ప్రతిరోజూ 140 కోట్లమంది ఫేస్‌బుక్‌కి లాగిన్ అవుతారు. పరిచయాలు పెంచుకోడానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన ఫేస్ బుక్.. దీనిసృష్టికర్తకూ మతిపోయేంతగా ఎదిగిపోయింది. 

ఫేస్‌బుక్‌ను మార్క్ జకర్‌బర్గ్ తన కాలేజీ వసతి గృహంలోని స్నేహితులు మరియు కంప్యూటర్ విజ్ఞాన శాస్త్రం విద్యార్థులు ఎడ్యుర్డో సావెరిన్, డస్టిన్ మోస్కోవిట్జ్ మరియు క్రిస్ హ్యూగ్స్‌తో కలసి ఆరంభించారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ ఎలియట్ జూకర్‌బర్గ్ 1984 మే 14న కరెన్, ఎడ్వర్డ్ జుకెర్ బర్గ్ దంపతులకు న్యూయార్క్‌లో పుట్టాడు. ఫేస్‌బుక్‌లో సభ్యత్వం ఆరంభంలో హార్వర్డ్ విద్యార్థులకు మాత్రం పరిమితం చేశారు. తరువాత బోస్టన్ ప్రాంతంలోని ఐవీ లీగ్ మరియు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం కళాశాలలకు విస్తరించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు,  13 ఏళ్ళకు పైబడి వయస్సు ఉన్న ఎవరికైనా ఇందులో సభ్యత్వాన్ని అందించేముందు, ఇతర విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులకు సహకారాన్ని అందించింది. అక్టోబరు 2010లో ఫేస్‌బుక్‌లో నెలకు 135.1 మిలియన్ల నెలవారీ అమెరికా వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్ 2010 నాటికి సోషల్ మీడియా టుడే గణాంకాల ప్రకారం అమెరికా జనాభాలోని 41.6శాతం మందికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. 2007 అక్టోబరు 24న, ఫేస్‌బుక్‌లోని 1.6శాతం వాటాను 240 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది, ఫేస్‌బుక్‌ విలువ మొత్తంగా దాదాపు 15 బిలియన్ డాలర్లను అందించింది.

వివాదాలు... విమర్శలు

ఫేస్‌బుక్ అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. కేంబ్రిడ్జ్ అనలిటికా వ్యవహారం తర్వాత ఫేస్ బుక్ గోప్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరంభంలోనే మధ్యమధ్యలో కొంతకాలం పాటు అనేక దేశాలలో ఆపివేశారు, అందులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, వియత్నాం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్,పాకిస్తాన్, సిరియా మరియు బంగ్లాదేశ్ లలో ఫేస్ బుక్ పై నిషేధం విధించారు. ఫేస్‌బుక్ అనుమతించిన ఇస్లాం వ్యతిరేక మరియు మత వివక్షత అంశాల కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని నిషేంధించాయి. ఉద్యోగస్తుల సమయాన్ని వృధా చేయకుండా ఆపటానికి అనేక పనిచేసే ప్రాంతాలలో కూడా దీనిని నిషేధించారు. ఫేస్‌బుక్ వాడుకదారుల గోప్యత కూడా ఒక సమస్యగా మారింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా హ్యాకర్ల బారిన పడింది. స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఫేస్‌బుక్ విలువ 500 బిలియన్ అమెరికా డాలర్లు, ఏడాదికి ఫేస్‌బుక్ లాభం 22 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్క్ జుకెర్ బర్గ్ ఆస్తి విలువ 71 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. జుకెర్ బర్గ్‌ని 2010లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా టైమ్ మ్యాగజైన్ ఎంపికచేసింది. 2018 రెండవ త్రైమాసికం నాటికి 13.23 బిలియన్ డాలర్ల రెవిన్యూ నమోదుచేయబడింది. 

జుకెర్ బర్గ్ దాతృత్వం 

చిన్న పిల్లల్లో వ్యాధులు, నివారణకు ఉద్దేశించిన ప్రణాళికకు గాను రూ. 20 వేల కోట్లు విరాళంగా ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు జుకెర్ బర్గ్. ‘బయోహబ్’ అనే సంస్థ వ్యాధుల నివారణకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, 600 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 నుంచి 15 పరిశోధనా సంస్థలతో కలసి పనిచేస్తామని తెలియజేశారు. చిన్నారుల జీవితకాలంలో వచ్చే వ్యాధులను నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని జుకెర్ బర్గ్ ప్రకటించారు. మాక్స్ అని పేరు పెట్టుకున్న కూతురి కోసం ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నాం అని జుకెర్ ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో చేతులు కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని 3 లక్షల కోట్లతో ప్రారంభిస్తున్నట్టు జుకెర్ బర్గ్ ప్రకటించారు. 

ఇండియాలో నిర్భయ ఉదంతాన్ని, అవినీతిపై జరిగిన పోరాటాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసికెళ్లి ప్రభుత్వాలను నిలదీసింది ఫేస్ బుక్.  టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ఓ సంచలనం. అలాంటి సంచలనాల్లో ఫేస్ బుక్ అగ్రస్థానంలో ఉంది. ఫేస్ బుక్ పుణ్యమాని విడివిడిగా ఉన్నవాళ్ళు జంటలవుతున్నారు. అదే క్రమంలో వారు విడిపోతున్నారు. నలుదిశల నుంచీ ఒక చోట చేరి.. ఓ పెద్ద జనసమూహంగా మారుతున్నారు. ప్రభుత్వాలను మార్చేయగలుగుతున్నారు. ఫేస్ బుక్ కొందరికి లాభం..మరికొందరికి నష్టం.. ఇంకొందరికీ ఓ వివాదం...ఏది ఏమైనా సోషల్ మీడియా మనలోని వ్యక్తిత్వాన్ని, ప్రతిభను వికసింపచేసే ఓ వారధి కావాలి. గోప్యతను నడిరోడ్డుపై పడేసి, జీవితాల్లో  వీడని చీకట్లను నింపకూడదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle