ఫేస్బుక్లో కొత్త ఫీచర్.. ట్రంప్‌కి షాకిచ్చిన జుకెర్ బర్గ్
20-06-202020-06-2020 13:18:00 IST
Updated On 20-06-2020 15:22:39 ISTUpdated On 20-06-20202020-06-20T07:48:00.920Z20-06-2020 2020-06-20T07:41:21.268Z - 2020-06-20T09:52:39.227Z - 20-06-2020

ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఫేస్ బుక్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఫేస్ బుక్ లో యాడ్స్ ని నియంత్రించే అవకాశం యూజర్లకు లభించనుంది. అంతేకాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్ ఈ సౌకర్యాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల యూజర్లు తమ ఫేస్బుక్ పేజీపై కనిపించే పొలిటికల్ యాడ్స్‌ను చాలా సులువుగా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. తమకు ఇష్టం అయితే చూడవచ్చు. గతంలోనే వివాదాస్పదమైన రాజకీయ ప్రకటనలు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ప్రదర్శన కావడంతో జుకర్‌బెర్గ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశ్యంతో ‘ఓటింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఎన్నికలకు సంబంధించి యూజర్లకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఓటు హక్కు కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.? ఓటింగ్ కేంద్రం వివరాలు, ఇతరత్రా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చని జుకర్‌బెర్గ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు 160 మిలియన్ ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ఫీడ్స్‌లో చూస్తారని భావిస్తున్నామన్నారు. ఈ. ఈ సంఖ్యను మరింతగా పెంచి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ టర్నవుట్ 4 మిలియన్‌కు చేర్చాలని లక్ష్యంతో వున్నారు జుకెర్ బర్గ్. ఫేస్ బుక్ ద్వారా యూజర్ల సమాచారం లీక్ కాకుండా కూడా టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు. అంతేకాదు, ఫేస్ బుక్ లో జాతి వివక్షను పెంచే ప్రకటనలను అనుమతించరు. ట్రంప్ వైఖరిని నిరసిస్తూ ఫేస్ బుక్ కొన్ని ప్రకటనలను తొలగించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రకటనల్ని ఫేస్బుక్ తొలిగించింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్వేశపూరిత సింబల్‌ను ఉపయోగించారన్న కారణంతో పోస్టులను తొలిగిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయ ఖైదీలను గుర్తించేందుకు వాడే నిషేధిత సింబల్స్‌ని ప్రకటనల్లో ఉపయోగించారన్న కారణంతో పోస్టులను తొలగించారు. అయితే ట్రంప్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
a day ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా