newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఫేస్‌బుక్‌కు షాక్... రూ.35వేల కోట్ల ఫైన్!

14-07-201914-07-2019 11:22:06 IST
2019-07-14T05:52:06.286Z14-07-2019 2019-07-14T05:51:55.032Z - - 21-08-2019

ఫేస్‌బుక్‌కు షాక్... రూ.35వేల కోట్ల ఫైన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫేస్ బుక్.. అందరినీ కట్టిపడేస్తున్న సామాజిక మాధ్యమం. ఇప్పుడు ఫేస్ బుక్ చిక్కుల్లో పడింది.  ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించడంలో విఫలమయిన ఫేస్ బుక్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’కు అమెరికన్ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ దాదాపు రూ.35,వేల కోట్లు భారీ జరిమానా విధించింది! కమిషన్‌ ఇంతటి జరిమానా విధించడం ఇదే తొలిసారి. 

అయితే దీనికి న్యాయ విభాగం తుది ఆమోదం తెలపాల్సి ఉందని తెలుస్తోంది. వ్యక్తిగత వివరాల బహిర్గతం కేసును 2011లో ఫేస్‌బుక్‌ పరిష్కరించుకుంది. కానీ, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయానికి అనుకూలంగా ప్రచార వ్యూహాలు రూపొందించేందుకు... లక్షలాదిమంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ అనే సంస్థకు అందించినట్టు ఆరోపణలు వచ్చాయి. 

దీనిపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ విచారణకు హాజరయ్యారు. అయితే సరైన వివరాలు అందచేయడంలేదని అప్పట్లో విచారణ కమిటీ అసహనం వ్యక్తం చేసింది. అమెరికాలో జనాభా కంటే ఫేస్ బుక్ చూసేవారే ఎక్కువ అని తేల్చడం వివాదానికి కారణమయింది, 

ఫేస్ బుక్ జిమ్మిక్కుల గురించి అందరికీ అనుమానాలున్నాయి. ఫేస్ బుక్ సంస్థే ప్రతి ఒక్కరిని ఫాలో అవుతోంది. యూజర్ల వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేయడం ఇది తొలిసారి కాదు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 9 కోట్ల మంది యూజర్ల డేటా సేకరించి, వారి మనోభిప్రాయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్యాంపెయిన్ స్ట్రాటజీ మార్చేశారు ట్రంప్. 

ఆయన అధికారంలోకి రావడానికి ఫేస్ బుక్ దోహదం చేసిందని అంటారు. ఫేస్ బుక్ తో చేసుకున్న ఒప్పందాలను 60కి పైగా సంస్థలు, 200 కోట్ల మంది డేటాను వాడుకున్నాయో అర్థం కావడంలేదు. ఫేస్ బుక్ దెబ్బకు అనేక సంస్థలు తమ ఖాతాలను ఉపసంహరించుకున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్, మోజిల్లా వంటి సంస్థలు ఫేస్ బుక్ పేజీలు మూసేశాయి. తాజా జరిమానా నేపథ్యంలో ఫేస్ బుక్ సేఫ్ అవునో కాదో? మీరే నిర్ణయించుకోండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle