newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫేక్ ‘షావోమీ’ వస్తున్నాయట.. పైలం మరి!

09-12-201909-12-2019 11:00:07 IST
2019-12-09T05:30:07.214Z09-12-2019 2019-12-09T05:30:02.960Z - - 14-04-2021

ఫేక్ ‘షావోమీ’ వస్తున్నాయట.. పైలం మరి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత మార్కెట్‌లో షావోమీ ఫోన్లకు ఉన్న ఆదరణ గురించి తెలియనిది కాదు.  బడ్జెట్‌ ఫోన్ల ఆన్‌లైన్‌ మార్కెట్‌లో షావోమీ గత కొన్నేళ్లుగా దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త మొబైల్‌ తీసుకొస్తూ బడ్జెట్‌ మార్కెట్‌ బ్రాకెట్‌లో రారాజుగా ఎదిగిపోతోంది. ఈ సమయంలో షావోమీకి ‘ఫేక్‌’ షాక్‌ తగిలింది. మార్కెట్‌లో ఇప్పుడు డూప్లికేట్‌ షావోమీ ఫోన్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవి ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం!

షావోమీ మొబైల్స్‌ మాత్రమే కాకుండా టీవీలు, స్మార్ట్‌ డివైజ్‌లు, ఎకో సిస్టమ్‌ ప్రోడక్ట్‌లు, వార్‌ ప్యూరిఫయర్స్‌ లాంటివి తీసుకొచ్చింది.  పెద్ద పెద్ద సంస్థలు ఇస్తున్న స్పెసిఫికేషన్లకు దాదాపు సమానంగా ఇస్తూ తక్కువ ధరకు వస్తుండటంతో షావోమీ ఫోన్లంటే యువత మోజు చూపిస్తోంది. అదే సమయంలో స్టాక్‌ తక్కువగా  అందుబాటులోకి తెస్తుండటంతో ఔట్‌ ఆఫ్‌స్టాక్‌ బోర్డు తరచుగా కనిపిస్తూ వచ్చింది.  ఇప్పుడు అదే తక్కువ ధరను, ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఫేక్‌ బాబులు రెచ్చిపోతున్నారు. 

షావోమీ ఫోన్ల పేరు, బ్రాండ్‌ లోగోలను వాడుకొని ఫేక్‌ ప్రాడెక్టులు రెడీ చేస్తున్నారు. గూగుల్‌లో షావోమీ ఫోన్ల పేరుతో సెర్చ్‌ చేసినప్పుడు, యాడ్స్‌ రూపంలోనూ చూపిస్తున్నారు. ఇక్కడ ఆ ఫోన్లు దొరుకుతాయేమో అనుకొని నెటిజన్లు కొనుగోలు చేస్తున్నారు. తీరా పార్శిల్‌ చూస్తే ఫేక్‌ అని తెలుస్తోంది. ఇలాంటి ఫోన్ల వల్ల డబ్బులు నష్టంతోపాటు, వ్యక్తిగత సమాచారం కూడా పోతాయని టెక్‌ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే సొంత వెబ్‌సైట్లు, పార్టనర్ వెబ్‌సైట్ల నుంచి కాకుండా ఇతర వెబ్‌సైట్ల నుంచి కాకుండా ఏ ఇతర వెబ్‌సైట్‌ను కొనుగోలు చేయకూడదు. 

Image result for fake xiaomi devices in market be aware

గుర్తించడం ఇలా...

మీరు కొనుగోలు చేసింది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్‌ ఇవీ...

*  ప్రోడక్ట్‌ సెక్యూరిటీ కోడ్‌ను ఎం.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఒరిజినల్‌ అయితే వివరాలు వస్తాయి.

* షావోమీ డెలివర్‌ చేసే వస్తువు ప్యాకేజీ చాలా ఫిట్‌ గా ఉంటుంది. ఎం.ఐహోం, ఎం స్టోర్‌ స్టాంపు ఉన్న స్టిక్కర్లు ఉంటాయి. వాటిని చెక్‌చేసుకోవచ్చు.

* ఎం లోగోలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఒరిజినల్‌ ఎంఐ లోగో ముదురు నారింజ రంగులో ఉంటుంది. 

* మీ దగ్గర ఎం.ఐ బ్యాండ్‌ ఉంటే దాంతో కూడా టెస్టు చేయొచ్చు. ఒరిజినల్‌ ఎం.ఐ ఫోన్లు మాత్రమే ఎంఐ ఫిట్‌ యాప్‌తో ఆథరైజ్‌ అవుతాయి.

* ఒరిజినల్‌ ఎంఐ ఫోన్లలో Li-Poly అని రాసి ఉంటాయి. ఇది చూసి కూడా చెక్‌ చేసుకోవచ్చు.

* యూఎస్‌బీ కేబుల్‌తో కూడా చెక్‌ చేయొచ్చు. ఒరిజినల్‌ ఎంఐ కేబుల్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle