ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ
22-05-202022-05-2020 09:25:26 IST
Updated On 22-05-2020 10:02:28 ISTUpdated On 22-05-20202020-05-22T03:55:26.479Z22-05-2020 2020-05-22T03:54:28.678Z - 2020-05-22T04:32:28.029Z - 22-05-2020

కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది. గత రెండునెలలుగా జనం ఇంటి పట్టునే వుంటున్నారు. రెస్టారెంట్లనుంచి ఫుడ్ తెప్పించుకునే అవకాశం లేదు. బిజినెస్ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ 4.Oలో భాగంగా సడలింపులు ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలయితే లిక్కర్ కూడా డోర్ డెలివరీ చేయవచ్చని చెప్పడంతో అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. కష్ట కాలంలో కస్టమర్ల ఇంటి దగ్గరే సేవలందించేందుకు ఫుడ్ బిజినెస్ సంస్థలు పోటీ పడుతున్నాయి.. అనేక నగరాల్లో పేరొందిన హోటళ్లు ఇప్పటికే ఫుడ్ డోర్ డెలివరీ సేవల్లోకి దిగిపోయాయి. వీటికి పోటీ ఇస్తూ లేటెస్టుగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ మొదట బెంగళూరులో ఫుడ్ సప్లయ్ సేవలను ప్రారంభించింది ప్రస్తుతం బెంగళూర్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రాథమికంగా కొన్ని రెస్టారెంట్ల నుంచే వీటిని డెలివరీ చేస్తామని అమెజాన్ తెలిపింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సేవలు విస్తరించే ప్రయాత్నాల్లో అమెజాన్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఫుడ్ డెలివరీ సర్వీసుల్లో దూసుకెళ్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలు కరోనా వైరస్ ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే మంచి సమయంగా భావించి అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగింది. ఆన్లైన్ ఆహార సరఫరా దిగ్గజం స్విగ్గీ కొత్తగా మరో ట్రెండుకు శ్రీకారం చుట్టింది. లిక్కర్ ప్రియుల సేవలో స్విగ్గి తరించిపోనుంది. మద్యాన్ని నేరుగా వినియోగదారుల ఇంటికే అందించే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. ప్రస్తుతానికి తమ సేవలు ఝార్ఖండ్‌లోని రాంచితో ప్రారంభమయ్యాయని స్విగ్గి ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరించేందుకు స్విగ్గీ రెడీ అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో తమ సేవలను విస్తరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంస్థ అధికారులు చెబుతున్నారు. స్విగ్గి యాప్‌లో వైన్ షాప్స్ విభాగం కొత్తగా కనిపిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వినియోగదారుల ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేసేందుకు స్విగ్గి లైసెన్సు తీసుకుంటోంది.. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తామని... వినియోగదారు చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధారించుకున్న తరువాతే వారికి మద్యాన్ని అందచేస్తామని సంస్థ చెబుతోంది. మొత్తం మీద ఇది లిక్కర్ లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. లాక్ డౌన్ నిబంధనలకు లోబడి హోం డెలివరీ సేవలు అందించటం ద్వారా రిటైల్ మద్యం దుకాణాలకు అదనపు వ్యాపారాన్ని అందించినట్టు అవుతుందని స్విగ్గీ చెబుతోంది. అంతేకాకుండా మాస్కులు, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించకుండా ప్రజలు గుమిగూడటం వంటి అవాంఛిత పరిణామాలను అరికట్టవచ్చని అంటోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా