newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫాస్టాగ్‌ గురించి మీకు తెలుసా.. ఇదిగో ఆసక్తికర విషయాలు

24-11-201924-11-2019 11:52:34 IST
2019-11-24T06:22:34.838Z24-11-2019 2019-11-24T04:30:47.835Z - - 22-04-2021

ఫాస్టాగ్‌ గురించి మీకు తెలుసా.. ఇదిగో ఆసక్తికర విషయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టోల్‌గేట్‌ చెల్లింపు ఝంఝాటాలు లేకుండా చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. చాలా రోజులుగా దీని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా డిసెంబర్‌ 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసలు ఫాస్టాగ్‌ అంటే ఏమిటి? దీనిని ఎలా వాడాలి? వీటిని ఎక్కడ నుంచి కొనుగోలు చేయొచ్చు? ఈ వివరాలు మీ కోసం!

జాతీయ రహదారుల మీద వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్లు టోల్‌గేట్‌ వచ్చిందంటే భయపడే రోజులూ ఉన్నాయి. పెద్ద పెద్ద క్యూలు దాటుకొని వెళ్లి టోల్‌ పేమెంట్‌ చేసి వెళ్లాలి. ఈ ఇబ్బందులు లేకుండా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ... నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2014లో ఫాస్టాగ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు.

Image result for fastag

ఇక్కడ దొరుకుతాయి:

బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌ను సులభంగా పొందొచ్చు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే 23 బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకుల నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు. వాహనం ముందు భాగంలో అద్దంపై ఫాస్టాగ్‌ను అతికించాలి. ఆ తర్వాత ఫాస్టాగ్‌ అతికించిన వాహనం టోల్‌ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. టోల్‌ ఫీజ్‌ డబ్బులు ఫాస్టాగ్‌కు లింక్‌ చేసిన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతాయి.

మరోవైపు అమెజాన్‌తో కూడా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు పేటీఎంలోనూ ఫాస్టాగ్‌ లభిస్తోంది. ఫాస్టాగ్‌ను వాడటానికి ముందుగా దానిని మీ బ్యాంకు ఖాతాతో జత చేయాలి. దీని కోసం ‘My FASTag’ అనే యాప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అక్కడ మీ వాహన రిజిస్ట్రేషన్‌ నెంబరు ఎంటర్‌ చేసి అడిగిన వివరాలతో లాగిన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. దీంతోపాటు ఈ యాప్‌ను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్‌ విధానం ద్వారా ఫాస్టాగ్‌ను రీఛార్జి చేసుకోవచ్చు.

డీఫాల్ట్‌గా ఇస్తారు...

ఒక వాహనానికి తీసుకున్న పాస్టాగ్‌ను వేరే వాహనానికి ఉపయోగించకూడదు. ఫాస్టాగ్‌ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరమంతా 2.5 శాతం చొప్పున ప్రభుత్వం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనం టోల్‌ప్లాజా గుండా వెళ్లినప్పుడు ట్యాగ్‌ ఐడీతో పాటు, బండి వివరాలు ఈటీసీ వ్యవస్థ ద్వారా సంబంధిత బ్యాంకుకు వెళ్తాయి. ఆ వివరాలను నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ)తో సరిపోల్చి అంతా సవ్యంగా ఉంటే నిర్దేశించిన రుసుము మొత్తం బ్యాంకు ఎన్‌ఈటీసీకి చేరుతుంది. కొత్తగా తయారయ్యే వాహనాలకు డీఫాల్ట్‌గా ఫాస్టాగ్‌ను ఇస్తారు.

Image result for fastag

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   5 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle