newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

29-05-202029-05-2020 11:23:57 IST
Updated On 29-05-2020 12:17:09 ISTUpdated On 29-05-20202020-05-29T05:53:57.249Z29-05-2020 2020-05-29T05:53:45.901Z - 2020-05-29T06:47:09.762Z - 29-05-2020

ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వినియోగదారుల నుంచి సాధ్యమయినంత ఎక్కువగా లాగేందుకు సెల్ కంపెనీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా సామాన్యులకు అందుబాటులో వుండే రూ.98 ప్రీ పెయిడ్ ప్లాన్ కి మంగళం పాడేశాయి ఇంచుమించు అన్ని కంపెనీలు. అయితే ఇతర లాంగ్ వ్యాలిడిటీ వోచర్లతో ఈ వోచర్ ఉపయోగించేవారికి అదనపు ప్రయోజనాలు కల్పించడం విశేషం.

వినియోగదారులకు వోడాఫోన్ శుభవార్త తెలిపింది.గతంలో ఇచ్చిన డేటా కన్నా రెట్టింపు డేటాను అందిస్తోంది. ఇందులో భాగంగానే కస్టమర్లను మరింత ఆకర్షించడానికి రూ.98 ప్లాన్‌పై బెనిఫిట్స్‌ని పెంచింది. ఇంతకు ముందు వోడాఫోన్ రీచార్జ్ రూ.98తో చేసుకుంటే వారికి 28 రోజుల వేలిడిటీతో 6జీబీ డేటా అందించేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కస్టమర్లకు అదనపు లాభాలను అందించేందుకు గాను రూ.98 రీఛార్జ్ చేసేవారికి ఇకపై 12జీబీ డేటా అందిస్తుంది. ఇది యాడ్ ఆన్ ప్యాక్. అంటే రూ.98 రీఛార్జ్ చేసుకుంటే 12జీబీ 4జీ డేటా మాత్రమే వస్తుంది. ఈ ప్యాక్ లో కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు.  ఈ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో కూడా లభిస్తుంది. అంతే కాదు జీ5 లేదా వొడాఫోన్ ప్లే లాంటి కాంప్లిమెంటరీ కంటెంట్ బెనిఫిట్స్ కూడా ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు లభించవు. 

ఇటు జియో కస్టమర్లకు షాకిచ్చింది జియో తన బడ్జెట్ ప్రీ పెయిడ్ ప్లాన్ రూ.98ని తొలగించింది. దీంతో ప్రస్తుతం జియోలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్లలో రూ.129 ప్లానే తక్కువ ధర ఉన్న ప్లాన్.  జియో రూ.98 ప్లాన్ ద్వారా గతంలో 2 జీబీ హై స్పీడ్ డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ వంటి లాభాలను అందించేది. రూ.98 జియో ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం జియో వెబ్ సైట్ లో కూడా కనిపించడం లేదు.

ఈ ప్లాన్ ద్వారా గతంలో 300 ఎస్ఎంఎస్ లు కూడా లభించేవి. ఈ డేటా కోటా పూర్తయ్యాక, నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ కు పడిపోతుంది. జియో కాకుండా ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి ఐయూసీ టాపప్ వోచర్ తో రీచార్జ్ చేసుకోవాలి. అయితే ఈ ప్లాన్ జియో వెబ్ సైట్ తో పాటు మైజియో యాప్ లో కూడా కనిపించడం లేదు. జియోలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్లలో రూ.129 ప్లాన్ వైపు సాధారణ కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ  ప్లాన్ ద్వారా 2 జీబీ డేటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలు అందిస్తారు. 300 ఎస్ఎంఎస్ మెసేజ్ లు, జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది. 

ఎయిర్ టెల్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. కేవలం 98 రూపాయలకు 5జీబీ మొత్తంలో 3G/4G మొబైల్ డేటా ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అందుకోవచ్చు. ఒక GBకి కేవలం 19.6 పైసలు మాత్రమే పడుతుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మై ఎయిర్ టెల్ యాప్ లో ఈ ప్లాన్ తక్కువమందికి కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో నివసించే అధిక శాతం మందికి మై ఎయిర్ టెల్ యాప్ లో బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ విభాగంలో ఇది వుంది. 5 జీబీ డేటాని 28 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వాడుకునే సౌలభ్యం వుంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle