ప్రియాంకా రెడ్డి... హాక్–ఐ మొబైల్ యాప్ వాడి వుంటే...
29-11-201929-11-2019 15:56:15 IST
2019-11-29T10:26:15.778Z29-11-2019 2019-11-29T10:26:08.965Z - - 11-04-2021

తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్యకేసు సంచలనం కలిగిస్తోంది. డాక్టర్ ప్రియాంకారెడ్డి ఆధునిక టెక్నాలజీని సరిగా వాడుకుని వుంటే.. హత్యకు గురయి వుండేది కాదని..తనను తాను కాపాడుకునేదని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో హాక్ -యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా బాధితురాలు సరైన సమయంలో స్పందించి ఉంటే వెంటనే పోలీసుల భరోసా లభిస్తుంది. ప్రయాణం ప్రారంభానికి ముందు ప్రియాంకా రెడ్డి పోలీసు అధికారిక యాప్ హాక్–ఐ లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. అయితే ఈ యాప్‌ను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. ముందుగా ‘హాక్–ఐ’లో ఉన్న ఎస్ఓఎస్లో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్ఓఎస్’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంటుంది. అర్థరాత్రిళ్ళు ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాలి. . వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన మార్గంలో కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో వెళుతుంటే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని అలర్ట్ చేస్తారు. అటు వైపు నుంచి స్పందన రాకుంటే పోలీసులే రంగంలోకి దిగి ఆమెను రక్షించేందుకు పెట్రోలింగ్ వాహనాలను అలర్ట్ చేస్తారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటారు. ఈ యాప్ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. హతురాలు ప్రియాంకా రెడ్డి ఈ యాప్ వాడి వుంటే ఈ అఘాయిత్యం జరిగి వుండేది కాదంటున్నారు పోలీసులు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
14 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా