newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రతి వారమూ కొత్త సినిమా ఫ్రీగా చూడవచ్చు..

22-09-201922-09-2019 17:00:24 IST
2019-09-22T11:30:24.824Z22-09-2019 2019-09-22T11:30:22.030Z - - 14-04-2021

ప్రతి వారమూ కొత్త సినిమా ఫ్రీగా చూడవచ్చు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జియో ఫైబర్ నెట్‌వర్క్ సేవలను రిలయన్స్ సంస్థ ప్రారంభించింది మొదలుగా వినోద పరిశ్రమ జుట్టు పీక్కునే తరహా ప్రకటనలు రోజుకొకటి వెలువడుతూనే ఉన్నాయి. సినీ నిర్మాణ సంస్థలు రూపొందించే సినిమాలను కొనుక్కుని వాటిని వీక్షకులకు అందించే సాంప్రదాయం రూట్ మార్చిన రిలయెన్స్ వారానికి ఒకటి చొప్పున సంవత్సరాని 52 సినిమాలను తానే రూపొందించే బృహత్ ప్రణాళికను తాజాగా ప్రకటించింది. దీని ముద్దుపేరు ఫస్ట్ డే ఫస్ట్ షో.. అంటే తొలి ఆఫర్లో వారానికి ఒక సినిమాను నిర్మించి విడుదల చేయనున్నారు. 

రిలయన్స్‌ అధినేత  ముకేశ్‌ అంబానీ చలనచిత్ర, వినోద రంగానికి నిజంగానే భారీ షాక్‌ ఇవ్వనున్నారు. సంవత్సరానికి 52 సినిమాలను సొంతంగా నిర్మించి విడుదల చేయనున్నామని, ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నామని ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కార్యాలయం ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌పాండే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 6 నుంచి 11 భాషల్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాని చెప్పారు. ఈమె గతేడాదే రిలయెన్స్‌లో చేరారు.

ఏడాది కనీసం 52 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందుకు సొంత స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేసి, సినిమాను నిర్మించటం, ఇతర ప్రొడక్షన్ హౌస్‌లతో ఒప్పందాలు, మూడవ పార్టీల ద్వారా సినిమాలను కొనాలనుకుంటున్నామని జ్యోతి దేశ్‌పాండే చెప్పారు. జియో స్టూడియోస్ ద్వారా మొత్తం 11 భాషలలో వెబ్ సిరీస్, మ్యూజిక్‌ లాంటి చిన్నపెద్దా కంటెంట్‌ ఉత్పత్తి చేస్తామన్నారు. ఈ ప్లాన్‌ను రెండు, మూడేళ్లలో అమలు  చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

చైనాలో 35వేల స్క్రీన్‌లుంటే, ఇండియాలో కేవలం 2వేల మల్టీప్లెక్స్‌ లున్నాయని ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ఆదాయం ఎలా పెరుగుతుందని ఆమె ప్రశ్నించారు. అందుకే తమ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ ద్వారా అత్యంత ఎక్కువమంది వినియోగదారులకు చేరువ కావాలని యోచిస్తున్నామని ఆమె చెప్పారు. తమ ప్రత్యేక వ్యూహాంతో నిర్మించిన చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. కాగా గతంలో జియో స్టూడియోస్‌ నిర్మించిన స్త్రీ, లుకా చుప్పి చిత్రాలు విజయవంతమయ్యాయి. వీటిపై 15 కోట్ల రూపాయల పెట్టుబడికిగాను, 150 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం.

ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ చానల్స్ ద్వారా వేలాది సినిమాలను నిత్యం ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. వీటికి జియో సినిమాలు కూడా తోడయితే భవిష్యత్తులో థియేటర్లు అనే పదం ఉనికిలో లేకుండా పోతుందేమే అని పరిశ్రమవర్గాలు భయపడుతున్నాయి. దశాబ్దాల పాటు గ్రామీణ ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ చక్కటి వినోదాన్ని అందించిన టెంట్లు పల్లెల నుంచి కనుమరుగైన విషయం చూస్తే థియేటర్లకు కూడా త్వరలో అదే గతి పట్టనుందేమో అనిపిస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle