పోస్ట్ పెయిడ్ సేవలు ప్రారంభం.. కానీ అవి బంద్!
15-10-201915-10-2019 15:14:59 IST
2019-10-15T09:44:59.276Z15-10-2019 2019-10-15T09:44:54.942Z - - 23-04-2021

కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో మొబైల్ పోస్ట్ పెయిడ్ సర్వీస్‌లను పునరుద్ధరించారు. దీని ప్రకారం సోమవారం నుంచి సుమారు 40 లక్షల మొబైల్ ప్రీ పెయిడ్ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అంతా బాగుందిలే అని వినియోగదారులు భావించారు. కానీ ఆదిలోనే హంసపాదులా టెలికాం సంస్థలు షాకిచ్చాయి. ఔట్‌గోయింగ్ కాల్స్‌ను టెలికాం సంస్థలు నిలిపివేశాయి. గత 72 రోజుల నుంచి సర్వీసులు లేనప్పటికీ కశ్మీరీలకు బిల్లులు పంపి.. ఔట్‌గోయింగ్ సేవలను కట్ చేశాయట టెలికాం సంస్థలు. బిల్లులు కట్టేందుకు ప్రయత్నించినా ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో ఇటు బిల్లులు కట్టలేక, ఎవరికైనా కాల్ చేసుకునే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కాశ్మీరీలు. ఇంటర్నెట్ వస్తే బిల్లులు చెల్లించేందుకు పిద్ధమని కాశ్మీరీలు అంటున్నారు. ఆర్టికల్ 370 అధికరణ రద్దు చేయడానికి ముందే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆగష్టు 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ సేవలు అందుబాటులోకి రావడంతో వారు కాసింత రిలీఫ్ పొందుతున్నారు.కశ్మీర్ లోయలో దాదాపు 70 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉండగా.. అందులో 40 లక్షల పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అటు 30 లక్షల ప్రీ-పెయిడ్ ఫోన్లు ఇంకా పునరుద్దరించాల్సి ఉంది. మరోవైపు ఇంటర్నెట్ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో ఎవరికీ సమాచారం లేదు. గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. లోయలోని ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులూ ఫోన్ సర్వీసులు నిలిపివేశామని అన్నారు. త్వరలో అన్ని సేవలు అందిస్తామన్నారు. కాగా సుమారు 20 లక్షల ప్రీ పెయిడ్ కనెక్షన్లు, ఇతర ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రస్తుతానికి ప్రారంభించడం లేదు. మరోవైపు కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు రావాలని, అక్కడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మి టీం కూడా కాశ్మీర్లో పర్యటించి అక్కడి వాస్తవిక స్థితిని బయటి ప్రపంచానికి వెల్లడించింది. కాశ్మీర్‌లోని రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, వర్తకులు, రవాణా రంగానికి చెందిన వారు, పండ్ల వ్యాపారులు, టాక్సీ యూనియన్లు. విద్యార్ధులు, ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, మేధావులు,ఉద్యోగులు, రచయితలు, రైతులు, జర్నలిస్టులు, కాశ్మీర్ పండిట్లు, సిక్కులు, క్రిస్టియన్లు ఇలా అన్ని వర్గాలకు చెందిన దాదాపు 350 మందిని షబ్నమ్ హష్మి తన బృందంతో వెళ్ళి కలుసుకున్నారు. కాశ్మీర్‌లోని పరిస్థితులపై మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వం చెబుతున్న కధనాలకు భిన్నంగా కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులు ఉన్నాయని సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మి పేర్కొన్నారు.శ్రీనగర్ నుండి బారాముల్లా వరకు, అనంతనాగ్ నుండి బద్గామ్, జమ్ము వరకు తాము కలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని హష్మి అంటున్నారు. మొత్తం మీద ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ ప్రజల్లో మార్పును తెస్తోంది. అయితే ప్రభుత్వ అజమాయిషీ పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
20 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా