newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేలుతున్నాయి జాగ్రత్త...!

12-09-201812-09-2018 05:30:00 IST
Updated On 09-10-2018 14:27:28 ISTUpdated On 09-10-20182018-09-12T00:00:00.000Z12-09-2018 2018-09-12T00:00:00.000Z - 2018-10-09T08:57:28.312Z - 09-10-2018

పేలుతున్నాయి జాగ్రత్త...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేం. నిద్రించే సమయంలోనూ పక్కనే పెట్టుకుంటున్నాం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అంతా సెల్‌ఫోన్లు వాడుతున్నారు. కుటుంబసభ్యుల కంటే కూడా ఫోన్‌నే ఇష్టంగా చూసుకుంటున్న రోజులివి. మొబైల్‌ ఫోన్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించకోకతప్పదు. సెల్‌ఫోన్‌లో లిథియం అయాన్‌ లేదా లిథియం పాలిమర్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇవి విద్యుత్‌తో ఛార్జ్‌ అవుతాయి. ఫోన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినా.. బ్యాటరీలో లోపమున్నా.. సామర్థ్యానికి మించి ఎక్కువ చార్జింగ్‌ చేసినా అవి పేలిపోతాయి. సెల్‌పోన్‌ లోపల సున్నితమైన భాగాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సన్నని సర్క్యూట్లు ఉంటాయి. వాటిపై సన్నని ఉండే ప్లాస్టిక్‌ తొడుగు షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా కాపాడుతుంది. ఫోన్‌ను ఎక్కువగా వాడినా, ఎక్కువ సేపు చార్జింగ్‌ పెట్టినా వేడెక్కి ప్లాస్టిక్‌ తొడుగు కరిగిపోతుంది. అప్పుడు సర్క్యూట్లు ఏదో ఓ సందర్భంలో కలిసిపోయి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఎక్కువ. రాత్రి వేళల్లో చాలామంది మొబైల్‌ ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టి అలాగే నిద్రిస్తుంటారు. దీని వల్ల ఎక్కువ సేపు చార్జింగ్‌ అయి బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు ఏదో ఒక రోజు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. సెల్‌‌ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా కాల్‌ వస్తే మాట్లాడకూడదు. ఈమధ్య అనేక ప్రమాదాలు ఇలా జరుగుతున్నవే. గంటల తరబడి గేమ్స్‌ ఆడడం... ఫోన్‌ మాట్లాడడం చేయకూడదు. అలా చేయడం వల్ల ఫోన్లు వేడెక్కి పేలిపోతుంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు.

 

* బ్యాటరీలో ఉండే ప్లస్, మైనస్‌లను ఒకదానికొకటి కలపకూడదు.

* పని చేయని బ్యాటరీలను మంటల్లో వేస్తే... అవి పేలతాయి.

* బ్యాటరీలను రాళ్లతో గానీ, ఇనుపు వస్తువులతో గాని చితక్కొట్టరాదు.

* బ్యాటరీలను విప్పి వాటి లోపలి భాగాలను విడదీసే ప్రయత్నం చేయకూడదు.

* బ్యాటరీలను మంటల వద్ద, గ్యాస్‌ స్టవ్‌ల వద్ద, హీటర్ల వద్ద ఉంచరాదు.

* సెల్‌ఫోన్లను తడిగా ఉన్నచోట ఉంచకూడదు. వర్షాకాలం వెంట చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్ళడం మంచిది. అందులో సెల్‌ఫోన్ ఉంచడం వల్ల తడవకుండా ఉంటుంది. తడిసిన ఫోన్‌తో మాట్లాడకూడదు.

* కంపెనీకి చెందిన ఒరిజనల్‌ చార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి.

* బ్యాటరీ ఉబ్బినట్లు గమనిస్తే వెంటనే మార్చాలి. ఒకేసారి వందశాతం ఛార్జింగ్‌ చేస్తే బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఛార్జింగ్‌ చేయాలి.

* 10 శాతం తగ్గకముందే ఛార్జింగ్‌ పెట్టడం మంచిది.

* ఫోన్‌ పొరపాటున నీళ్లలో పడిపోతే తీసి వెంటనే ఛార్జింగ్ పెట్టడం చేయవద్దు. బ్యాటరీని నేరుగా ఎండలో పెట్టకూడదు. నీడలోనే ఆరబెట్టాలి. ఒకవేళ ఆరకపోతే ఒక పాత్రలో బియ్యం తీసుకుని, అందులో బ్యాటరీ లేదా సెల్‌ఫోన్‌ ఒక రాత్రి అంతా ఉంచాలి. బియ్యానికి తేమను పీల్చుకునే గుణం ఉంటుంది. తద్వారా బ్యాటరీలోని తేమ పోయి సెల్‌ఫోన్‌ మామూలుగా పనిచేస్తుంది.

* విరిగిన, వైర్‌ కట్‌ అయిన చార్జర్లు ఉపయోగించకూడదు.

* కొన్ని ఫోన్లలో బ్యాటరీ ఒక్క రోజులో లేదా గంటల వ్యవధిలో అయిపోతుంది. ఇలాంటి సమయంలో బ్యాటరీలు మార్చుకోవాలి.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle